పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెస్ట్ మ్యాన్ దగ్గుబాటి రానా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు హీరోలు రిలాక్స్ అవుతున్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. నులకమంచం మీద పవన్, ఎద్దుల బండి మీద రానా పడుకుని ఉన్న ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతోంది.