అనన్య పాండే కేసులో విజయ్ దేవరకొండకు గుబులు..

  0
  492

  హీరోయిన్ అనన్య పాండే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది. ఆర్యన్ ఖాన్ తో ఆమె చాటింగ్ బయటపడింది. ఆమె తెలుగు సినిమా లైగర్ లో హీరోయిన్ గా నటిస్తోంది. హీరో విజయ్ దేవరకొండతో కలసి ఆల్రడీ షూటింగ్ లో పాల్గొంది. సినిమా దాదాపుగా పూర్తయింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు. హీరోయిన్ చార్మీ కూడా ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ లో పనిచేసింది. ప్రస్తుతం అనన్య పాండేని ఎన్సీబీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తుండటంతో ఇటు టాలీవుడ్ లో కూడా గుబులు మొదలైంది.

  అనన్య పాండే షూటింగ్ స్పాడ్ లో ఎలా ఉండేది, అమెకు డ్రగ్స్ డీలింగ్స్ ఏవైనా ఉండేవా అంటూ టాలీవుడ్ కాంటాక్ట్స్ పై కూడా ఎన్సీబీ విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీంతో టాలీవుడ్ లో కూడా చాలామంది భయపడుతున్నట్టు సమాచారం. అసలే ఓసారి డ్రగ్స్ కేసు విచారణలో పూరీ జగన్నాథ్ హాజరయ్యారు, వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి అనన్య పాండే వ్యవహారంతో పూరీ చిక్కుల్లో పడతారనే పుకార్లు మొదలయ్యాయి.

  ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్ విచారణ సందర్భంగా ఎన్‌సీబీ అధికారులు నిన్న కీలక సమాచారాన్ని కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. క్రూయిజ్‌ నౌకపై పార్టీ జరుగుతున్న సమయంలో ఆర్యన్‌ డ్రగ్స్‌ కోసం ఓ కొత్త నటితో వాట్సాప్‌ చాటింగ్‌ చేసినట్లు పేర్కొన్న ఎన్‌సీబీ.. ఆ వివరాలను కోర్టుకు సమర్పించింది. ఆ చాట్‌లో ఉన్నది అనన్య పాండే పేరే అని తెలుస్తోంది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..