49 ఏళ్ళ పాక్ ఎంపీకి 18 ఏళ్ళ పెళ్ళాం..

    0
    195

    పాకిస్తాన్ పార్లమెంట్ సభ్యుడి అమిర్ లియాఖత్ ఆలీఖాన్ 18 ఏళ్ళ యువతిని మూడో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య సినీ నటి తుబార్ అమిర్. ఆమెకు విడాకులు ఇచ్చిన రోజే , సైదా ధనియా అనే 18 యువతిని నిఖా చేసుకున్నాడు. లియాఖత్ కు 49 ఏళ్ళ వయసుంది. పెళ్లికూతురుని 18 నెలల వయసులో అతడు చేతుల్లో ఎత్తుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. చిన్ననాటినుంచి తాను ఆరాధించి , అభిమానించిన గొప్ప వ్యక్తికీ భార్యను కావడం ఎంతో ఆనందంగా ఉందని సైదా ధనియా ప్రకటించింది.

    తన సోషల్ మీడియా అకౌంట్ నిండా ముసలిమొగుడు ఫొటోలతో నింపేసింది. చిన్నప్పుడు తాను ఏడ్చేప్పుడు , టివిలో అమిర్ లియాఖత్ ఆలీఖాన్ ని చూస్తే ఏడుపు ఆపేసేదాన్నని చెప్పింది. తాను అన్నం తినకపోతే , ఏడుపు ఆపకపోతే లియాఖత్ ఫొటో చూపించేవాళ్ళని చెప్పింది.

    ఇంతకీ సైదా ధనియా , సామాన్య కుటుంబ యువతికాదు. ఆమె పెద్ద కుటుంబానికి సంబందించిన యువతి. పాకిస్తాన్ లోని దక్షిణ పంజాబ్ లోని లోధ్రన్ కి చెందిన సాదత్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆ ప్రాంతంలో వాళ్లకు మంచి పేరుప్రఖ్యాతలు ఉన్నాయి. అటువంటి కుటుంబానికిచెందిన సైదా ధనియా 18 ఏళ్ళ వయసులో , చిన్న నాడు తనను ఎత్తుకొని తిరిగిన లియాఖత్ ఆలీఖాన్ ను పెళ్లాడటమే ఇప్పుడు పాకిస్తాన్ లో సంచలనం..

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..