ఆ హీరోలను కూడా రప్పించాడు ..జగన్ చిన్నోడు కాదు..

  0
  93

  సినిమా టికెట్ రేట్ల విషయంలో ముఖ్యమంత్రి అనుకున్నదే అయిందా..? హీరోలు అనుకుంటున్నవారిని ఒకటికి రెండుసార్లు తన చుట్టూ తిప్పుకుని క్రెడిట్ ఒకరికి కాకుండా తనకే దక్కేట్టు సినీరంగంలో తన మనుషులకి గౌరవం పెరిగేట్టు వ్యూహరచన చేసి విజయం సాధించారా?

  ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే చెప్పాలి. సినిమా టికెట్ల విషయంలో గత రెండు 3నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చర్చ సోషల్ మీడియాలో విమర్శ, ప్రతివిమర్శలు సినీరంగంలో అల్లకల్లోలం, రాజకీయ వర్గాల్లో వాదోపవాదాలు ఇలా ఎన్ని జరిగినా జగన్ చలించలేదు. సినీ నిర్మాతలు, దర్శకులు, ఎంతమంది వచ్చి సమాచార శాఖ మంత్రి, ముఖ్యమంత్రితో చర్చ జరిపినా సమస్యలకు శుభం కార్డు పడలేదు. ఆ తర్వాత నాగార్జున, చిరంజీవి, ఆర్.నారాయణ మూర్తి.. ఇలా అనేక మంది ముఖ్యమంత్రిని కలసిపోతున్నా చర్చలు జరిపి, సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుందని సాక్షాత్తూ చిరంజీవే గతంలో ప్రకటించినా, సమస్యకు మాత్రం పరిష్కారం దొరకలేదు.

  చివరకు ముఖ్యమైన హీరోలు చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ.. ఇలా ముఖ్యమైన హీరోలతోపాటు ఎవరూ ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డికి సినిమా రంగంలో వీర విధేయుడుగా ఉన్న పోసాని కృష్ణమురళి, ఆలీ.. వీరిద్దర్ని కూడా పిలిపించి సమస్యకు పరిష్కారం చూపుతున్నట్టుగా చెప్పారు. టాప్ రేంజ్ హీరోలతోపాటు, పోసాని కృష్ణమురళి, ఆలీని కూడా పిలిపించుకున్నారంటే, దానర్థం సినిమా రంగ సమస్యలకు పరిష్కారం కనుగునే క్రమంలో హీరోల మాటే కాదు, ఇండస్ట్రీలో తనకి అండగా నిలబడి, తన తరపు మాట్లాడే పోసాని, ఆలీ కూడా ఉండాలనే పట్టుదలే జగన్ లో ఉన్నట్టు కనిపించింది.

  ఆలీ కూడా గత ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వీరిద్దరు వచ్చిన తర్వాతే ఈ సమస్యకు పరిష్కారం లభించిందా అన్న విషయం కూడా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలో చిరంజీవి, నాగార్జున వచ్చినా చూపని పరిష్కారం వీరు వచ్చిన తర్వాతే చూపినట్టు అయింది. బహుశా.. సినిమా టికెట్ల సమస్యకు పరిష్కారం కనుగొనే క్రమంలో వారిద్దరూ ఉండాలనే ప్లాన్ తోనే జగన్ ఇలా చేశారని అనిపిస్తోంది. ఇది కాకుండా కొంతమంది సినీ జీవులు, మాకు సీఎం కేసీఆర్, జగన్ కాదని హైదరాబాద్ లో అన్నట్టు ఓ బలమైన ప్రచారం జరిగింది. ఇది కూడా హీరోలను జగన్ తన చుట్టూ తిప్పుకునేందుకు ఒక కారణం కావచ్చు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..