ఈ ఆత్మహత్యల బ్రిడ్జి మిస్టరీ తేలేదెప్పుడు..?

  0
  13996

  సైన్స్ కి అంద‌ని ఎన్నో విష‌యాలు ఇప్ప‌టికే మిస్ట‌రీలుగా మిగిలిపోయాయి. వాటిలో బెర్ముడా ట్ర‌యాంగిల్ పై అనేక వాద‌న‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. అలాగే మ‌న‌దేశంలోని అస్సాంలో జ‌తింగా అనే ప్రాంతంలో బొరైల్ కొండ‌ల్లో ప్ర‌తి ఏడాది వేల‌కొద్ది ప‌క్షులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటాయి.

  రాత్రి ఏడు నుంచి ప‌ది గంట‌ల లోపునే అవి ఇలా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌తాయి. వేగంగా వ‌చ్చి కొండ‌ల‌కి, స్థంభాల‌కి ఢీ కొట్టుకుని చ‌చ్చిపోతాయి. 1910లో ఇది బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది. అప్ప‌టి నుంచి ఎంతోమంది ప‌క్షి శాస్త్ర‌జ్జులు దీనికి కార‌ణం కనుక్కోవాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. ఇప్ప‌టికీ ప‌క్షులు ఆత్మ‌హ‌త్యలు చేసుకుంటున్నాయి.

  అలాంటిదే కుక్క‌ల ఆత్మ‌హ‌త్య‌ల ప్రాంతం ఒక‌టి ఉంది. స్కాట్లాండ్ లోని డంబ‌ర్ టాన్ సిటీలోని ఓవ‌ర్ టౌన్ బ్రిడ్జి వ‌ద్ద ప్ర‌తి ఏడాది కుక్క‌లు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటాయి. 1950లో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అప్ప‌టి నుంచి శాస్త్ర‌వేత్త‌లు ఇక్క‌డ కూడా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఓవ‌ర్ టౌన్ బ్రిడ్జి పైనుంచి కింద‌కు 50 అడుగులు ఉంటుంది. కింద రాళ్ళు ఉంటాయి. అక్క‌డి వ‌ర‌కు వ‌చ్చిన కుక్క‌లు ఉన్న‌ప‌ళంగా య‌జ‌మాని ప‌ట్టుకుని ఉన్నా, విడిపించుకుని బ్రిడ్జిపై నుంచి కింద‌కి దూకి చ‌నిపోతాయి.

  స‌గ‌టున 600 కుక్క‌లు ఇలా బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంటాయి. దీనికి కార‌ణం ఏమిట‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌క‌పోయినా జ‌తింగాలో ప‌క్షుల మాదిరి కుక్క‌లు కూడా ఓవ‌ర్ టౌన్ బ్రిడ్జి వ‌ద్ద‌కు వ‌చ్చి ఎందుకు సుసైడ్ చేసుకుంటాయో, అక్క‌డ భూత‌ప్రేత పిశాచాలు వీటిని ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపిస్తాయ‌ని స్థానికులు చెబుతుంటారు. 1950కి ముందు ఒక ప్ర‌మాదంలో కొంత‌మంది చ‌నిపోయార‌ని, వారితో పాటు పెంపుడు కుక్క కూడా చ‌నిపోయింద‌ని, ఆ కుక్క ప్రేతాత్మే ఇక్క‌డికి వ‌చ్చిన కుక్క‌ల‌ను ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా ప్రేరేపిస్తోంద‌నే వాద‌న కూడా ఉంది.

  అలిస్ ట్రెవ‌రో అనే మ‌హిళ మాట్లాడుతూ 2014లో తాను త‌న కొడుకుతో పోతూ బ్రిడ్జి వ‌ద్ద ఆగాన‌ని, అప్పుడు త‌మ పెంపుడు కుక్క కారులో నుంచి దిగి, ఉన్న‌ప‌ళంగా బ్రిడ్జిపై నుంచి కింద‌కి దూకేసింద‌ని చెప్పింది. ఇక్క‌డ ఏదో తెలియ‌ని అదృశ్య శ‌క్తి కుక్క‌ల‌పై ప్ర‌యోగం చేస్తోంద‌ని చెప్పింది. కెన్నెత్ మెకేల్ కూడా ఒక‌రోజు త‌న కుక్క‌తో వాకింగ్ వెళుతుండ‌గా, ఆ కుక్క అక‌స్మాత్తుగా బ్రిడ్జిపై నుంచి దూకి చనిపోయింద‌ని చెప్పాడు. ఇలా చాలామంది కుక్క‌ల య‌జ‌మానులు త‌మ అనుభ‌వాల‌ను వెల్ల‌డించారు.

  అందుకే ఓవ‌ర్ టౌన్ బ్రిడ్జికి డాగ్స్ సుసైడ్ బ్రిడ్జి అనే పేరు పెట్టారు. మ‌రికొంత‌మంది న‌మ్మ‌కం ప్ర‌కారం, ఒక వితంతువు 30 ఏళ్ళు భ‌ర్త లేకుండానే గ‌డిపి, పెంపుడు కుక్క‌తో స‌హా బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని చెబుతున్నారు. ఆ కుక్క ఆత్మ ఇలా కుక్క‌ల‌ను ఆత్మ‌హ‌త్య‌ల‌కు ప్రేరేపిస్తోంద‌నేది మ‌రో వాద‌న‌. ఏదేమైనా ఆ బ్రిడ్జి మీద‌కి కుక్క‌లు పోతే పైనుంచి చ‌నిపోతాయ‌న్న‌ది మాత్రం వాస్త‌వం. దీనికి కార‌ణం ఏమిటో ఇంత‌వ‌ర‌కు తెలియ‌లేదు.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..