అష్ట భార్యల ఇష్ఠమైన మొగుడు..

  0
  796

  ఒకరుకాదు , ఇద్దరుకాదు , ముగ్గురు కాదు.. ఏకంగా ఎనిమిదిమంది భార్యలు.. ఇదేమి విచిత్రంకాదు.. ఇంతకంటే ఎక్కువమంది భార్యలున్న వాళ్ళు ఉన్నారుకదా అని మీరు అనుకోవచ్చు.. నిజమే ,,అయితే మనోడి భార్యలందరూ అతడికి ప్రియురాళ్ళే.. అమ్మాయిలను ప్రేమించి మరీ పెళ్లిచేసుకుంటాడు.. ఇలా అతడి జీవితంలో ప్రేమించడం , పెళ్లాడటం.. ఇదెప్పుడు ఆగిపోతుందో చెప్పలేనంటున్నాడు.. థాయిలాండ్ కి చెందిన ఓండాంగ్ సోరోట్ . ఇప్పటి వరకు అతడు ఎనిమిదిమంది అమ్మాయిలను ప్రేమించి పెళ్లాడాడు.. ప్రేమించిన అమ్మాయిని మిగిలిన భార్యలకు పరిచయం చేసిన తరువాతే , పెళ్లిచేసుకుంటాడు.. ఇందుకు అందరినీ ఒప్పిస్తాడు.

  ప్రస్తుతానికి ఇంట్లో ఒక్కో రూమ్ లో ఇద్దరు భార్యలు చొప్పున నాలుగు గదుల్లో ఎనిమిదిమంది భార్యలను ఉంచాడు. తన బెడ్ రూమ్ లోకి రొటేషన్ పద్దతిలో భార్యలను పిలుస్తుంటాడు.. అంటే ఎనిమిది రోజులకు ఒక బార్యచొప్పున ఆయనతో రాత్రి గడుపుతుంటారు.. ఒక వేళ ఇబ్బందులేమైనా వస్తే , లాటరీ సిస్టంలో తన గదిలోకి ఎవరు రావాలో డిసైడ్ చేస్తాడు. మొదటి భార్యను , ఒక స్నేహితుడి పెళ్ళిలో చూసి మనసు పారేసుకున్నాడు.. ఆమెను ప్రేమించి పెళ్లాడాడు.

  అప్పటినుంచి మనోడి ప్రేమ ,పెళ్లి యాత్ర మొదలయింది. రెండో భార్యను ఒక కూరగాయల మార్కెట్లో , మూడో భార్యను ఒక హాస్పిటల్లో , నాలుగో భార్యను ఇన్స్టాగ్రామ్ లో , ఐదో భార్యను ఫేస్ బుక్ లో , ఆరో భార్యను టిక్ టాక్ లో , ఏడో భార్యను ఒక గుడిలో , ఎనిమిదో భార్య నాంగ్ మాయిని పట్టయ్య బీచ్ లో చూసి మనసు పారేసుకున్నాడు.

  ఎనిమిదో భార్యను చూసిన సమయంలో , ఆయనతో నలుగురు భార్యలు ఉన్నారు.. వారితో బీచ్ లో విహరిస్తున్నప్పుడు , ఎనిమిదో భార్య నాంగ్ మాయిని చూసాడు.. వెంటనే ఐ లవ్ యు , అనేశాడు.. ఆమె కూడా ఒప్పేసుకుంది.. అక్కడేఉన్న నలుగురు భార్యలు కూడా ఒకే చెప్పేసారు. అంతే పెళ్లయిపోయింది.. ఈ ఎనిమిది మంది భార్యలు చెప్పేమాట ఒక్కటే.. తమ భర్త లాంటి మంచోడు , ఈ భూమిమీదలేడని.. అదీ సంగతి అష్ట భార్యల ఇష్ఠమైన మొగుడు కథ..

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..