నలుగురు ప్రియుళ్లు. ఒక ప్రియురాలు.

  0
  982

  ఇది ఓ యువ‌తి విచిత్ర వికృత ప్రేమ‌గాధ‌. ఆమె ద్రౌప‌ది ఎక్కువ‌, తార‌కు త‌క్కువ‌. ఒకే ద‌ఫా న‌లుగురు యువ‌కుల‌ను ప్రేమించేసింది. ఆ న‌లుగురులో ఎవ‌రిని పెళ్ళి చేసుకోవాలో తెలియ‌క‌, తిక‌మ‌క‌ప‌డి అంద‌రూ త‌న‌కు ఇష్ట‌మేన‌ని చెప్పేసింది. ఆ న‌లుగురు మాత్రం త‌మ‌లో ఒక‌రికే ఆ అమ్మాయి ద‌క్కాల‌ని కోరుకుంటున్నారు. దీంతో పంచాయితీ పెద్ద‌లు ఏకంగా ల‌క్కీ డ్రా తీశారు.

  https://ndnnews.in/bride-elopes-before-reception/

  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాంపూర్ జిల్లాలో గోసాండి అనే గ్రామంలో జ‌రిగిన విచిత్ర సంఘ‌ట‌న‌. గ్రామంలో న‌లుగురు యువ‌కుల‌తో ప్రేమ‌లో ప‌డ్డ యువ‌తి, న‌లుగురితో క‌లిసి లేచిపోయింది. అంద‌రూ ర‌హ‌స్యంగా క‌లిసి త‌మ‌లో ఒక‌రినే కోరుకోమ‌న్నారు. అమ్మాయి మాత్రం అంద‌ర‌నీ స‌మంగా ప్రేమిస్తుంద‌ని చెప్పింది. ఈలోగా అమ్మాయి త‌ల్లిదండ్రులు అజీంన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.

  https://ndnnews.in/bridesuicide-before-marraige-1837-2/

  ఈ న‌లుగురు యువ‌కులు త‌మ‌లో ఒక‌రి బంధువుల ఇంట్లో ఆ అమ్మాయిని ఉంచారు. ఈ విష‌యం తెలిసిన బంధువులు ఆ అమ్మాయిని త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించేశారు. ఆ త‌ర్వాత గ్రామ పెద్ద‌లు పంచాయితీ చేసి న‌లుగురిలో ఒక‌రినే పెళ్ళి చేసుకోమ‌ని ఆ అమ్మాయికి చెప్పారు. అయితే ఎవ‌రినీ పెళ్ళి చేసుకోవాలో తెలియ‌క అయోమ‌య ప‌రిస్థితిలో ప‌డిపోయింది. దీంతో న‌లుగురు యువ‌కుల అనుమ‌తి తీసుకుని పంచాయితీ పెద్ద‌లు ల‌క్కీ డ్రా తీశారు. న‌లుగురు యువ‌కులు పేర్లు చీటీల్లో రాసి గ్రామంలో ఉండే ఓ పిల్ల‌వాడి చేత తీయించారు. ఆ నాలుగు చీటీల్లో ల‌క్కీ డ్రాలో పేరు వ‌చ్చిన యువ‌కుడితో ఆ అమ్మాయి పెళ్ళి చేశారు.

  https://www.timesnownews.com/india/article/up-panchayat-in-rampur-holds-lucky-draw-to-select-groom-for-girl-who-eloped-with-four-men/728129

  ఇవీ చదవండి:

  భర్తను చంపేసిన భార్య నటన చూస్తే , ఆడవాళ్ళలో ఇంత కిరాతకమా అనిపిస్తుంది..

  ఆమె ఫొటోలు వేశ్యాగృహాల్లో, రెడ్ లైట్ ఏరియాలో ఆమె విగ్రహం ఎందుకుంది. ? ఆమె ఎవరు.. ??

  ఇదొక్కటి చేయండి.. మీ ఇంట్లో వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది..