వృద్ధుడిని బ్యాంకు లాకర్ రూమ్ లోనే వదిలేసి, తాళం వేసేశారు..

    0
    241

    యూనియన్ బ్యాంకు సిబ్బంది నిర్వాకంతో హైదరాబాద్ లో ఓ వృద్ధుడు అష్టకష్టాలు పడ్డాడు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని యూనియన్ బ్యాంకులో కృష్ణారెడ్డి అనే 84 ఏళ్ల వృద్ధుడికి ఖాతా ఉంది. ఆ బ్యాంకులోనే అతడికి లాకర్ కూడా ఉంది. అతనికి సంబంధించిన నగలు, ఆస్తి పత్రాలు అన్నీ ఆ లాకర్ లోనే దాచి ఉంచేవాడు. అప్పుడప్పుడు వెళ్లి.. అవసరమైన నగలను తెచ్చుకునేవాడు.

    ఈ నేపథ్యంలో నిన్న కూడా యూనియన్ బ్యాంకుకు వెళ్ళాడు.. లాకర్ లోని వెళ్లి.. తనకు కావాల్సిన వస్తువులను తీసుకుంటుండగా.. బ్యాంకు సిబ్బంది తలుపులు మూసివేశారు. లోపల మనుషులు ఉన్నారా.. లేదా అని కూడా చూసుకోకుండా నిర్లక్ష్యంగా బ్యాంకు లాకర్ రూమ్ కు తాళాలు వేసేశారు. దీంతో ఆ వృద్ధుడు చాలాసేపు తలుపులు కొట్టినా ప్రయోజనం లేకపోయింది. ఇంతలోనే బ్యాంకు సమయం కూడా ముగియడంతో బ్యాంకు మొత్తానికి తాళాలు వేసి.. సిబ్బంది మొత్తం ఇళ్లకు వెళ్లిపోయారు.

    అయితే బ్యాంకుకు వెళ్లిన కృష్ణారెడ్డి ఎంతకూ రాకపోవడంతో, ఇంట్లోని కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. బ్యాంకు ప్రాంగణం మొత్తం వెతికి చూశారు. చుట్టూ వెతికినా కనిపించకపోవడంతో చివరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. రాత్రంతా కృష్ణారెడ్డి కోసం వెతుకుతూనే ఉన్నారు. తీరా ఈ ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి లాకర్ తలుపులు తీసేసరికి కృష్ణారెడ్డి లోపల కనిపించారు. జరిగిన విషయం తెలుసుకొని.. కృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలించారు. బ్యాంకు సిబ్బంది చేసిన నిర్వాకానికి పాపం ఆ వృద్ధుడు రాత్రంతా అవస్థలు పడాల్సి వచ్చింది.

     

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..