త్వరలో మొబైల్లో ఆ కాలర్ ట్యూన్ కి గుడ్ బై ..

  0
  81

  మొబైల్లో ఎవరికన్నా కాల్ చేస్తే అవతల వైపు నుంచి కరోనా సమాచారం గురించి, కరోనా జాగ్రత్తలు గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం ఉంటుంది .. ఇది చాలామంది వినియోగదారులకు ఇబ్బందిగా కూడా పరిణమిస్తోంది.. దీన్ని తొలగించాలని టెలికం ఆపరేటర్లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా భయం తొలగి పోయింది, కరోనా అపోహలు వీడిపోయాయి , మహమ్మారి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని , అందువల్ల కరోనా కలర్ ట్యూన్ తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పత్రం సమర్పించారు.. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ , కేంద్ర ఆరోగ్య శాఖకు సూచన పంపింది .

  కరోనా కి సంబందించిన వాయిస్ మెసేజ్ ని కాలర్ టోన్ నుంచి తీసి వేసేందుకు అనుమతించాలని కోరింది. మరియు కాలర్ ట్యూన్స్ గా దీన్ని ఎక్కువకాలం కొనసాగించే అవకాశం లేదని కూడా తేల్చి చెప్పింది . కేంద్ర టెలికం శాఖ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖకు కూడా సూచన చేసింది. మరో వారం పది రోజుల్లో మొబైల్ కాలర్ ట్యూన్ గా దీన్ని తీసివేసేందుకు , గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలిసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితి అదుపులో ఉండడం వల్ల ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు , మరియు కరోనా కాలర్ ట్యూన్స్ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివిధ వర్గాల నుంచి టెలికం ఆపరేటర్లకు విజ్ఞప్తి అందినట్టు ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

  అర్జెంట్ కాల్స్ లో కూడా కరోనా కాలర్ ట్యూన్ పూర్తయ్యేంత వరకు లైన్ లోనే ఉండాల్సి వస్తుందని అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారు. దీనికితోడు ఎక్కువ బ్యాండ్ విడ్త్ వినియోగం అవుతోందని , అందువల్ల దీన్ని ప్రస్తుతం తొలగించే ఆలోచన చేయాలని కోరారు. దీంతో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ, కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయమై పరిశీలన చేసి త్వరలో తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ కరోనా సంబంధించిన నిబంధనలను రెండేళ్ల తర్వాత పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా కాలర్ ట్యూన్ తొలగించాలన్న కోరికను కూడా కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తోంది..

   

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..