చలిమంటకు భార్యాభర్తల సజీవదహనం..

  0
  86

  శ్రీకాళహస్తి లంక మిట్ట గిరిజన కాలనీలో వృద్ధ దంపతులు అగ్నిప్రమాదంలో సజీవదహనమయ్యారు. చలి మంటలు వేసుకుంటూ వయోవృద్ధులు అగ్ని మంట లో చిక్కుని కాలి పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది వద్ద ఉన్న లంక మిట్ట గిరిజన కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లంక మిట్ట గిరిజన కాలనీలో ప్లాస్టిక్ వస్తువులు సేకరించుకుని బ్రతుకు జీవనం సాగిస్తున్న వయో వృద్ధులు గుడిసెలో నివసిస్తున్నారు.

  వయోభారంతో పూర్తిగా లేవలేని స్థితి కి రావడం మరోవైపు అనారోగ్యంతో బాధపడుతుండటంతో మంచానికే పరిమితమైన పరిస్థితి. మంగళవారం తెల్లవారుజామున తీవ్ర చలికి తట్టుకోలేక చలి మంట వేసుకున్న వృద్ధులకు గుడిసే లో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు కూడా అంటుకోవడంతో అగ్ని మంటలు చెలరేగి పోవడంతో వయోవృద్ధులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ ఘటనలో 80 ఏళ్ల వెంకటసుబ్బయ్య 75 ఏళ్ల లక్ష్మమ్మ పూర్తిగా దహనమయ్యారు.

  మంటలు ఆపడానికి ప్రయత్నించిన అప్పటి కే గుడిసె పూర్తిగా దగ్ధం కావడంతో తో వారి ప్రయత్నం వృధా అయింది. ఘటనకు సంబంధించి మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడి స్థానికులు మాట్లాడుతూ రాత్రి చలిమంట వేసుకుని ఉండగా లేవలేని స్థితిలో నీ వారి గుడిసె అంటుకుని దగ్ధం అయినట్లు తెలిపారు. ఎంత ప్రయత్నించిన మంటలు ఆర్పే లేకపోయిన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..