స్మార్ట్ ఫోన్ కోసం ఒకడు భార్యను అమ్మేశాడు..

  0
  551

  స్మార్ట్ ఫోన్ కోసం ఒకడు భార్యను అమ్మేశాడు.. నమ్మశక్యంగాని ఈ కేసును అతికష్టం మీద పోలీసులు ఛేదించి ఆమెను విడుదల చేయించారు. ఒరిస్సాలోని బలంగీర్ లో 17 ఏళ్ళ మోరి అనే యువకుడికి 26 ఏళ్ళ మహిళతో పెళ్లి చేశారు. పెళ్ళైన నెలరోజుల తర్వాత వీరిద్దరూ రాజస్థాన్లోని బరన్ లో , ఇటుకల తయారీ పనికి వెళ్లారు. అక్కడ పనిచేస్తుండగా ఒక ఆసామి కన్ను మోరి భార్యమీద పడింది. దీంతో మోరికూడా , తనకు డబ్బులిస్తే భార్యను ఇచ్చేస్తానని చెప్పాడు. 17ఏళ్ళ భర్తకు , 26 ఏళ్ళ భార్య ఎందుకని ఆసామి చెప్పడంతో భార్యను ఇచ్చేసి , డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులతో 70 వేల రూపాయలకు ఫోన్ కొన్నాడు. మిగిలిన డబ్బులతో జల్సాచేసుకొని , గ్రామానికి వచ్చేసాడు. భార్య ఎక్కడని అడిగితే , తనను వదిలేసి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి , పోలీసులకు ఫిర్యాదుచేస్తే , భార్యను అమ్మేశానని ఒప్పుకున్నాడు. స్మార్ట్ ఫోన్ కోసమే అమ్మేశానని చెప్పాడు. వాడిని వెంటబెట్టుకొని పోలీసులు రాజస్థాన్ కి వెళ్లి , ఆమెను తీసుకొచ్చారు. మోరి మైనర్ కావడంతో అతడిని , బాలుర సంరక్షణ కేంద్రానికి తరలించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..