19 నిమిషాలు.. మూడు లక్షల టికెట్లు.. తిరుమల వెంకన్నా మజాకా..!

  0
  419

  19 నిమిషాలు..
  మూడు లక్షల టికెట్లు.. తిరుమల వెంకన్నా మజాకా..!
  ==============================

  తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు ఈ ఉదయం ఆన్ లైన్ లో సర్వదర్శనం టికెట్లు విడుదల చేశారు. రికార్డు స్థాయిలో కేవలం 19 నిమిషాల్లోనే మూడు లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విషయంలో భక్తులు అసంతృప్తిగా ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం ఆన్ లైన్ లో టికెట్లు సంపాదించాలంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇటీవల జియో కంపెనీతో టీటీడీ అధికారులు సమావేశమయ్యారు. ప్రత్యేకంగా టీటీడీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన జియో ప్రతినిధులు ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ డిజైన్ చేశారు.
  తాజాగా విడుదల చేసిన సర్వదర్శనం టికెట్ల విషయంలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండానే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన బుకింగ్.. కేవలం 19నిమిషాల్లోనే మూడులక్షల టికెట్లు బుక్ అయి చరిత్ర సృష్టించింది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..