బీహార్ లో పంచాయితీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీహార్ మామూలుగానే.. భీభత్సంగా ఉంటుంది.. అలాంటిది ఇక ఎన్నికల సమయంలో అయితే చెప్పనవసరం లేదు. గొడవలు, కొట్లాటలు, ప్రతీరోజూ జరిగేవే.. ఎన్నికల సమయంలో ప్రతీ అభ్యర్థి తన సత్తా చూపించడం కూడా మామూలే.. నామినేషన్ వేసే దగ్గర నుంచి.. తమ స్థోమతకు తగినట్టుగా గోలగోల చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ అభ్యర్థి నామినేషన్ వేశాడు. అతగాడి పేరు ఆలమ్.. ఖతియా జిల్లా రాంపూర్ పంచాయితీలో పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు.. ఏమనుకున్నాడో ఏమో.. తెలీదు గానీ.. తానూ ప్రజాసేవ చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా నామినేషన్ వేశాడు. అందరిలా కోట్లు ఖర్చు చేసి.. కార్లతో ర్యాలీలు చేసి.. నామినేషన్ వేసేందుకు స్థోమత లేదని భావించి.. తన దగ్గర ఉండే దున్నపోతుపై వెళ్లి, నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించాడు. ఇంకేముంది.. నామినేషన్ వేసేందుకు దున్నపోతుపై రావడంతో మీడియా కళ్లన్నీ ఆలమ్ పైనే పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిచ్చ పబ్లిసిటీ కొట్టేశాడు మన ఆలమ్..
#WATCH | Bihar Panchayat Polls 2021: Azad Alam, a candidate from Katihar district's Rampur panchayat arrived to file his nomination on a buffalo yesterday pic.twitter.com/CBIF0bbqPl
— ANI (@ANI) September 13, 2021