అసెంబ్లీ క్యాంటిన్ మూత . స్టాలిన్ మరో సంచలనం .

    0
    1937

    తమిళనాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ త‌న సింప్లిసిటీని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అధికార పీఠం ఎక్కిన త‌ర్వాత హోదాను సైతం ప‌క్క‌న పెట్టి నిరాడంబ‌రంగా ఉంటున్న విష‌యం తెలిసిందే. సామాన్యుల‌తో కూడా మ‌మేక‌మై త‌న మార్క్ చూపిస్తున్నారు. ఇటీవ‌ల బ‌స్సులో ప్ర‌యాణించి, ప్ర‌యాణికుల‌తో ముచ్చ‌టించి, బ‌స్సు ప్ర‌యాణాల‌పై ఆరా తీశారు. ఇక పార్టీలోనూ సంచ‌ల‌నాత్మ‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటూ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు కూడా. తాజాగా అసెంబ్లీలో క్యాంటీన్ మూసివేయాల‌నే కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు భోజ‌న ఖ‌ర్చు, ప్ర‌భుత్వ ఖ‌జానాపై ప‌డుతుంది. అయితే ఆ ఖ‌ర్చు చేసే బ‌దులు ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆ ధ‌నం వినియోగించ‌వ‌చ్చ‌ని, అందుకే ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

    ఇక‌పై అసెంబ్లీ క్యాంటీన్ ను మూసి వేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు స్టాలిన్. ఇకపై అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి భోజన ఏర్పాట్లు వారే చూసుకోవాలని స్పష్టం చేశారు. క్యాంటీన్ మూసివేస్తున్నందున ప్రజాప్రతినిధులు వారి ఇళ్ల నుంచిగానీ, హోట‌ళ్ళ నుంచిగానీ భోజనాలు తెచ్చుకోవాలని సూచించారు. మ‌రోవైపు కాన్వాయ్ ల వెహిక‌ల్ సంఖ్య‌ను కుదిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. కాన్వాయ్ వ‌ల్ల ప్ర‌యాణీకుల‌కు, ట్రాఫిక్ కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని భావిస్తూ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న కాన్వాయ్ వెహిక‌ల్స్ ను కూడా స‌గానికి త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆయ‌న‌కే చెల్లింది. ద‌ట్ ఈజ్ స్టాలిన్.

     

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..