భర్త మరణాన్ని ఒప్పుకోని 39మంది భార్యలు..

    0
    223

    ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్‌ ఘాకా మరణం ఇటీవల ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అయితే ఆయన చనిపోయి 36 గంటలు దాటుతున్నా, ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఇంకా అంతిమ సంస్కారాలు చేయలేదు. అంతే కాదు, ఆయనింకా జీవించి ఉన్నాడని, మరణించలేదని అంటున్నారు వారంతా.
    మా ఆయన చనిపోలేదు..
    తమ శ్రీవారు ఇంకా బతికే ఉన్నారంటూ.. జియాన్ 39 మంది భార్యలు ముక్త కంఠంతో చెబుతున్నారు. 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు కూడా అదే మాటమీదున్నారు. 76 ఏళ్ల జియాన్‌ స్థానిక లాల్పా కోహ్రాన్‌ ధర్‌ తెగకు అధిపతి. బీపీ, షుగర్‌ తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని, నాడి కొట్టుకుంటూనే ఉందని చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్‌ ఖుమా చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్‌ను పూడ్చిపెట్టేదిలేదన్నారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్‌ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుంటారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..