విడాకులపై సమంత నోరు విప్పితే..?

  0
  3916

  నాగచైతన్యతో విడాకుల విషయంలో సమంత నోరు విప్పితే ఏమవుతుంది..? అక్కినేని కుటుంబం పరువు బజారున పడుతుందా..? నాగచైతన్య అసలు విషయం బట్టబయలు అవుతుందా..? విడాకుల తర్వాత సమంతపై అభిమానుల కామెంట్ల దాడి ఎక్కువైంది. ఆమె అసభ్యంగా బట్టలు వేసుకోవడం, జుకల్కర్ తో అభ్యంతరకరమైన ఫొటోల్లో కనిపించడం ఇలాంటి విషయాల్లో ఆమెనే తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో సమంత నిన్న రెండు దఫాలుగా చేసిన ట్వీట్లలో విడాకుల విషయంలో ఆడవారినే తప్పుబట్టే నైతిక విలువలు లేని ఒక సమాజం మంచిది కాదంటూ ఘాటుగానే చెప్పింది. మగవారిదేమీ తప్పులేదన్నట్టు ప్రవర్తిస్తారని చెప్పింది. ఆ తర్వాత ట్వీట్ లో తనపై రూమర్లు వస్తున్నాయని, తనకేదో అఫైర్లు ఉన్నట్టు పుకార్లు పుట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే చివర్లో తన సహనాన్ని పరీక్షించొద్దని తను నోరు విప్పితే గుట్టు బయటపడుతుందని పరోక్షంగానే హెచ్చరించింది.

  దీన్నిబట్టి సమంతను నోరు తెరవనీయకుండా ఒక పథకం ప్రకారం ఆమెపై దాడి జరుగుతుందనే అనుమానం కూడా కొంతమందిలో మొదలైంది. దీనికి నాందిగా ఇటీవల సినీ నటి మాధవీ లత ఒక ఇంటర్వ్యూలో విడాకుల విషయంలో అక్కినేని కుటుంబానిదే పూర్తి తప్పని చెప్పింది. కోట్లు సంపాదిస్తున్న సమంతకు వేలు చేతులో పెట్టి, ఆమెను తక్కువ స్థాయిలో బతికే విధంగా చేశారని ఆరోపించింది. బిడ్డలు కావాలనుకున్న సమంతకు, బిడ్డలు కలగనీయకుండా కూడా చేశారని ఆరోపించింది. ఇప్పుడు తాజాగా శాకుంతలం సినిమా నిర్మాత నీలిమ గుణ, ఓ సంచలన నిజాన్ని బయటపెట్టింది.

  శాకుంతలంలో నటించే ముందు కాల్షీట్ల సమయంలోనే తాను త్వరలో బిడ్డను కని కొంతకాలంపాటు సినీ రంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు, బిడ్డ యోగక్షేమాలు మాత్రమే చూసుకుంటూ పక్కా గృహిణిగా ఉండిపోవాలన్న ఆశ ఉన్నట్టు సమంత తనకు చెప్పిందని నీలిమ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. శాకుంతలం సినిమా కాల్షీట్ల విషయంలో జరిగిన ఈ చర్చ సందర్భంగా ఆమె చాలా ఆలోచించే షెడ్యూల్స్ ఇచ్చిందని, అయితే ఆమె అభిప్రాయాన్ని తాము గౌరవిస్తామని కూడా చెప్పామని నీలిమ తెలిపింది. సమంతపై పుకార్లు కల్పిత కథనాలు వస్తున్నాయని వాస్తవానికి ఆమె తల్లి కాదలచుకున్న విషయం చాలా గట్టిగా చెప్పిందని, ఆ విషయంలో ఆమె చెలా ఆశలతో కూడా ఉందని నీలిమ చెప్పింది. దీన్నిబట్టి సమంతను మాధవీలత చెప్పినట్టు ఒక డబ్బు సంపాదించి పెట్టే యంత్రంగా చూశారా అన్నదే ఇప్పుడు చర్చ. ఈ కారణంగానే ఆమె విడాకులు తీసుకుందా అన్న విషయం కూడా చర్చనీయాంశమైంది. ఆమెను తల్లికానీయకుండా చేశారని, తల్లి అయితే సినిమాలకు దూరమవుతుందనే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్టు అర్థమవుతోంది. నిజమేదో సమంత నోటిగుండానే బయటకు రావాలి. అయితే ఆమె తననిలాగే రెచ్చగొడితే నోరు తెరవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించడంతో సహజంగా ఆమె అక్కినేని కుటుంబం గురించి ఏదో రహస్యం దాస్తుందనే విషయం మాత్రం బట్టబయలైంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..