ఆర్యన్ , అనన్య డ్రగ్ లవర్స్..అనన్య అరెస్ట్..?

  0
  3262

  బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో ప‌ట్టుబ‌డ‌డంతో లోతైన విచార‌ణ కోసం దాడులు చేప‌ట్టారు. ముంబైలోని ఆర్త‌ర్ జైలులో ఉన్న కొడుకు ఆర్య‌న్ ను చూసి వ‌చ్చిన గంట‌లోపే ఈ దాడులు జ‌ర‌గ‌డం విశేషం. ఆ త‌ర్వాత అనన్య‌పాండే ఇంటికి వెళ్ళారు. అక్క‌డ విస్తృతంగా త‌నిఖీలు చేశారు. ఆర్య‌న్ ఖాన్ బెయిల్ పిటీష‌న్ పై విచార‌ణ జ‌రుగుతున్న నేప‌ధ్యంలో ఎన్సీబీ అధికారులు ఒక కీల‌క‌మైన వాట్స‌ప్ చాట్ ను కోర్టుకు స‌మ‌ర్పించారు.

  ఆర్య‌న్ ఖాన్, అన‌న్య‌పాండే మ‌ధ్య జ‌రిగిన ఈ వాట్స‌ప్ చాట్ లో డ్ర‌గ్స్ కి సంబంధించి ఏ డ్ర‌గ్ మంచిది, ఏది బాగుంటుంది, ఏ డ్ర‌గ్ తీసుకుంటే మ‌జా ఉంటుంద‌నే విష‌యంపై చాటింగ్ చేశారు. దీంతో ఈ ఇప్పుడు అన‌న్య‌పాండే ఇర‌కాటంలో ప‌డింది. అన‌న్య‌ను కూడా ఎన్సీబీ అధికారులు ప్ర‌శ్నించేందుకు అదుపులోకి తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. ముంబైలో లేట్ నైట్ పార్టీల్లో అన‌న్య పాండే, ఆర్య‌న్ ఖాన్ ఉండ‌డం అంద‌రికీ తెలిసిందే. అన‌న్య‌తో ఆర్య‌న్ విచ్చ‌ల‌విడిగా తిరుగుతుంటాడ‌ని కూడా తెలిసింది. వీరిద్ద‌రూ నైట్ అవుట్స్ లో క‌నిపిస్తుంటారు. వీరిద్ద‌రూ క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని తెలుస్తోంది. అన‌న్య‌పాండేను కూడా అరెస్ట్ చేసే చాన్స్ ఉంది. ఇదిలావుంటే, త‌న బెయిల్ కోసం ఆర్య‌న్ హైకోర్టుకు వెళుతున్న‌ట్లు స‌మాచారం.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..