ఉత్తరాఖండ్ లో వరదల బీభత్సం ఇంకా కొనసాగుతొంది.. వర్షాలు తగ్గు ముఖం పట్టినా ఊళ్లను చుట్టుముట్టిన వరద ఇంకా తగ్గలేదు. గోలా నది మధ్యలో ఉన్న ఒక ఎత్తైన ప్రాంతంలో చిక్కుకుపోయిన ఆరుగురిని సైన్యం హెలికాఫ్టర్ ద్వారా ఇలా రక్షించింది. రెండు రోజులు ప్రాణాలు అరచేతిలోపెట్టుకొని నదీమధ్యలోనే గడిపారు..తల్లితండ్రులు నలుగురు పిల్లలు.. పెరుగుతున్న వరద నీటిని తట్టుకుంటూ , తల్లితండ్రులు ముందుగా చిన్నవారినుంచి పెద్దవారివరకు ఒక్కొక్కరిని హెలికాఫ్టర్ టాబ్ లో ఎక్కించారు. చివరగా భార్యను ఎక్కించి , భర్త ఆఖరున ఎక్కాడు.. ముందుగా ఎవరిని కాపాడుకోవాలన్న విషయంలో వారి ప్రాధాన్యత , తల్లితండ్రుల త్యాగానికి నిదర్శనం.
#UttarakhandRain on going rescue operation Mi-17 Helicopter pic.twitter.com/CtR9YOPEkP
— Pyara Uttarakhand (@PyaraUKofficial) October 19, 2021