వీడు గాలితో పేషేంట్లను చంపేస్తాడు..ఉరి ఖరారు

  0
  9894

  వాడికి చంప‌డం ఓ స‌ర‌దా. పేషంట్లు గిల‌గిలా కొట్టుకుని చ‌స్తుంటే మ‌హాఇష్టం. త‌న ఆనందం కోసం కొంత‌మంది పేషంట్ల‌కు ఇంజ‌క్ష‌న్ ఇచ్చి చంపేస్తుంటాడు. మేల్ న‌ర్సుగా ప‌నిచేసే విలియం డేవిస్ విషం ఇచ్చి పేషంట్ల‌ను చంపేస్తాడ‌నుకుంటే పొర‌పాటే. చాలా తెలివిగా సిరంజిలోకి గాలిని ఎక్కించి ఆ గాలిని గుండెను క‌లిసే ర‌క్త‌నాళాల్లోకి ఎక్కిస్తాడు. ముఖ్యంగా గుండె జ‌బ్బు పేషంట్ల‌కు ఇలా చేసేవాడు. ర‌క్త‌నాళాల్లోకి ఎక్కించిన గాలి.. క్ర‌మంగా మెద‌డుకు చేరి మెద‌డులో ఉండిపోయి వారం రోజుల్లో మ‌ర‌ణం సంభ‌విస్తుంది. దీన్ని క‌నుక్కోవ‌డం చాలా క‌ష్ట‌మే. అయితే ఇలా చ‌నిపోయిన వాళ్ళ బ్రెయిన్ స్కాన్ లు యార్ బ్రో అనే రేడియాలజిస్ట్, ఆ బ్రెయిన్ లో గాలి ఉండ‌డాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. దీంతో ఆ హాస్పిట‌ల్ లో గ‌తంలో తీసిన బ్రెయిన్ స్కాన్ లు పరిశీలించాడు.

  ఆరు కేసుల్లో ఇలాంటివే క‌నిపించాయి. దీంతో అనుమానం వ‌చ్చి మిగితా కేసుల‌ను ప‌రిశీలించాడు. ఆ స‌మ‌యంలో అన్ నేచుర‌ల్ డెత్ అనే నావెల్ గుర్తుకొచ్చింది. ఆ త‌ర్వాత 1985లో షాడో చేజ‌ర్స్ అనే షార్ట్ ఫిల్మ్ గుర్తుకొచ్చి దాన్ని చూశాడు. దాంట్లో ఒక న‌ర్సు పేషంట్ల‌ను ఇలానే చంపింది. సిరంజిలోకి గాలిని తీసుకుని ఆ గాలిని పేషంట్ల న‌రాల్లోకి ఎక్కించింది. అదే విధంగా ఈ హాస్పిట‌ల్ లో పేషంట్లు చ‌నిపోయార‌ని యార్ బ్రో నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఈ విష‌యాన్ని ఆస్ప‌త్రి సిబ్బందితో క‌లిసి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. పోలీసులు సీసీ పుటేజీ ప‌రిశీలించ‌గా, డేవిస్ సిరంజీల్లోకి గాలిని ఎక్కించ‌డం, పేషంట్ల‌కు ఎక్కించ‌డం గుర్తించారు. త‌ద్వారా గుండెకి, మెద‌డుకి స‌మ‌స్య‌లు త‌లెత్తి విల‌విల‌లాడుతూ పేషంట్లు చ‌నిపోయారు. మెడిక‌ల్ క్రిమిన‌ల్ ఆలోచ‌న డేవిస్ కి ఎలా వ‌చ్చిందో తెలియ‌దు గానీ, సినిమాల్లో, సీరియ‌ల్స్‌, క‌ధ‌ల్లోనే త‌ప్ప నిజ జీవితంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. డేవిస్ చేసిన పనికి అతనికి ఉరిశిక్ష విధించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..