కొత్త కారు బ్రేక్ తొక్కపోయి, యాక్సిలేటర్ తొక్కాడు.

    0
    4789

    కొత్త కారు కొన్న సంతోషం అతడికి ఎక్కువ సేపు నిలవలేదు.. కారు గురించి పూర్తిగా తెలుసుకునేలోపే ఆ కారు కాస్తా తుక్కుతుక్కుయింది. హైదరాబాద్ నాగోల్ లోని టాటా టియాగో షోరూంలో ఈ సంఘటన జరిగింది. కారు కొనేందుకు ఓ వ్యక్తి షోరూంకు వెళ్ళాడు. టాటా టియాగో కారును సెలెక్ట్ చేసుకున్నాడు. సేల్స్ మెన్ కారులోని ఫీచర్స్ అన్ని ఒక్కొక్కటిగా చెబుతున్నాడు.. ఇంతలో కారు కొనేందుకు వచ్చిన వ్యక్తి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. ఏం చేశాడో ఏమో తెలియదుగానీ.. ఒక్కసారిగా కారు ముందుకు కదిలింది. వెంటనే అప్రమత్తమైన సేల్స్ మెన్ కారును ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. కారు వేగంగా మొదటి అంతస్థులో నుంచి.. అద్దాలను పగలగొట్టుకుంటూ కిందకు పడిపోయింది. దీంతో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. ఆటోమాటిక్ కారు పట్ల పూర్తి అవగాహన లేకపోవడంతోనే ఇలా జరిగిందని షోరూం సిబ్బంది చెప్పారు.

    ఇవీ చదవండి..

    ఛీ.. ఛీ.. కొడుకుతో అలా చేస్తారా..?

    అక్కడనుంచి తెస్తే ఒక ఐ ఫోన్ -12 ప్రో మీద లాభమెంతో తెలుసా..?

    అడ్వాన్స్ గా ముద్దిచ్చి పో అంటూ ఓ టీచ‌ర్.

    నగ్మాకు 47 ఏళ్ళొచ్చినా పెళ్లెందుకు కాలేదో కారణం తెలుసా..?