జగన్ తో నాగార్జున భేటీ.. చిరు మిస్సింగ్..

  0
  420

  సినీరంగ సమస్యలపై ఏపీ సీఎం జగన్ తో చర్చించేందుకు నాగార్జున విజయవాడ వచ్చారు. ఆయనతోపాటు మరో ఇద్దరు సినీ నిర్మాతలు కూడా వచ్చారు. అయితే సహజంగా ఇలాంటి చర్చలకు చిరంజీవి లీడ్ తీసుకుంటారు. ఆయన ఆధ్వర్యంలోనే సినీ జనాలు సీఎంలను కలిసేందుకు వెళ్తారు. గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు సినీ ప్రముఖులు వచ్చిన సందర్భంలో చిరంజీవే అందరినీ ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు నాగార్జున సింగిల్ గా రావడం చర్చనీయాంశమైంది.

  మా గొడవల వల్లే చిరు మిస్ అయ్యారా..?
  ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలతో చిరంజీవి ఏపీకి రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. మా ఎన్నికల్లో చిరు మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. ఆయనకి పోటీగా నిలిచిన విష్ణు గెలవడంపై పెద్ద గొడవ జరిగింది. దీంతో చిరంజీవి ఈ దఫా సినిమా ఇండస్ట్రీ తరపున చర్చలకు రాలేదని అంటున్నారు.

  అసలు నాగ్ భేటీ దేనికోసం.. ?
  పోనీ చిరంజీవి రాకపోయినా సురేష్ బాబు, దిల్ రాజు లాంటి ఇతర నిర్మాతలయినా ఈ మీటింగ్ కి రావాలి కదా..? మరి వారు కూడా ఎందుకు మిస్ అయ్యారనేదే అసలు ప్రశ్న. అసలు నాగార్జున, సీఎం జగన్ తో భేటీ అవడానికి కారణం సినిమా సమస్యలేనా.. లేక ఇంకేదయినా కారణం ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..