మోహన్ బాబు Vs నాగబాబు
టాలీవుడ్ లో మరో ట్విస్ట్..
విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగశ్రీనుకు మెగా బ్రదర్ నాగబాబు ఆర్థికసాయం అందజేశారు. హెయిర్ డ్రస్సర్ నాగశ్రీనును తన ఇంటికి పిలిపించుకుని.. అసలు విషయం ఆరా తీశారు. నాగశ్రీను, తన తల్లి అనారోగ్యం గురించి నాగబాబుకు వివరించారు. దీంతో స్పందించిన నాగబాబు.. యాభై వేల రూపాయల ఆర్ధికసాయాన్ని అందజేశారు. అయితే నాగబాబు కావాలనే ఇలా చేశారా..? లేక మానవత్వంతో స్పందించాడో తెలియదు కానీ.. మోహన్ బాబుపై తన కోపాన్ని ఈ విధంగా తీర్చుకున్నాడని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మోహన్ బాబు ఫ్యామిలీ, ఈ విషయంపై ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.