ముస్లిం బాలికల వివాహ వయసుపై పంజాబ్ హైకోర్టు ఏం చెప్పిందంటే..?

    0
    572

    ముస్లిం బాలికల పెళ్లిళ్ల విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ముస్లిం బాలికలకు పెళ్లి విషయంలో మైనార్టీ వయసు పరిగణలోకి రాదని స్పష్టం చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం మరియు, ప్రిన్సిపల్స్ ఆఫ్ మహ్మదియన్ లా (ఆర్టికల్ -195) ప్రకారం ముస్లిం బాలిక రజస్వల అయిన తర్వాత తనకి ఇష్టం వచ్చిన వ్యక్తిని లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లిని చేసుకునే అర్హత ఉందని స్పష్టం చేసింది.

    వివాహానికి అర్హత ముస్లిం పర్సనల్ లా ప్రకారం మతి స్థిమితం లేని బాలికలు, లేదా మైనర్లుగా ఉండి రజస్వల కానివారు.. 18ఏళ్లు నిండిన తర్వాతే వివాహానికి అర్హులు. 15 ఏళ్లు దాటితే రజస్వల వయసు దాటినట్టేనని, అటువంటి బాలికలను రజస్వల అయినట్టే భావిస్తామని జస్టిస్ ఆల్కా శెరిన్ స్పష్టం చేశారు.

    పంజాబ్ లో ఇద్దరు ముస్లిం మహిళలు దాఖలు చేసుకున్న కేసుకి సంబంధించి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. 36ఏళ్ల ఓ వ్యక్తి 17ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి 21న వివాహం జరిగింది. వారిద్దరికీ ఇది మొదటి పెళ్లే. అయితే బంధువులకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టుకి వెళ్లారు. ఇద్దరికీ పెళ్లి చేసుకునేందుకు అన్ని అర్హతలు ఉండటంతో తమను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని కోర్టుకి విన్నవించుకున్నారు. వారిద్దరికీ సరైన రక్షణ కల్పించాల్సిందిగా కోర్టు చండీఘడ్ ఎస్పీని ఆదేశించింది.

    ఇవీ చదవండి:

    పెళ్లికొడుకే గుర్రం ఎక్కి ఊరేగాలా ..? పెళ్లికూతురు ఎక్కకూడదా..??

    యవ్వనంలో యవతీ యువకుల ప్రేమ ప్రకృతి సహజం

    ఆ దేవుడికి పళ్ళు , ఫలహారాలు కాకుండా , మద్యమే నైవేద్యంగా ఎందుకు పెడతారో తెలుసా..?