పెళ్లికొడుకే గుర్రం ఎక్కి ఊరేగాలా ..? పెళ్లికూతురు ఎక్కకూడదా..??

  0
  195

  పెళ్లికొడుకే గుర్రం ఎక్కి ఊరేగాలా ..? పెళ్లికూతురు ఎక్కకూడదా..?? పాతకాలంలో అయితే కుదరదు అని ఖండితంగా చెప్పేస్తారు.. ఇప్పుడు కాలం మారింది.. నీ కంటే నేనుతక్కువా అనే పెళ్లికూతుళ్ళు వచ్చేశారు.

  చీర కట్టుకొని , సిగ్గుతో తలదించుకుని పెళ్లిపీటలమీద కూర్చునే కాలంకాదిది. మోడ్రన్ అమ్మాయిల మేరేజ్ స్టైల్ కూడా మారింది.. దీపావలేచ అనే అమ్మాయికూడా అలాంటిదే.. పెళ్లిమండపానికి పెళ్ళికొడుకు గుర్రం మీద వస్తే , పెళ్లికూతురు పెళ్ళికొడుకు ఇంటికి గుర్రం మీద వచ్చింది. అత్తగారింట్లో గుర్రం దిగి కాలుపెట్టింది. సాత్నా నగరంలో జరిగిందీ ఘటన.

   

  https://fusion.werindia.com/incredible-india/bride-rides-horse-to-convey-gender-equality-message

  తల్లితండ్రులకు ఆమెఒకటే కూతురు. అల్లారుముద్దుగా పెరిగింది. కూతురు కోరిక కాదనలేకపోయారు. భర్త , అత్తమామలు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ లో కూడా , పెళ్లికూతురు సడెన్ గా , గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చేసింది. మరోపెళ్లికూతురు నల్లకళ్లద్దాలతో డ్యాన్స్ చేస్తూ పెళ్లిమండపానికి వచ్చింది.. ఇలా మేరేజ్ ట్రెండ్స్ మారిపోతున్నాయి..

   

  https://ndnnews.in/doctor-got-vaccinated-without-wife-phone-conversation-is-goes-viral/