జగన్ విజయ దరహాసం-బాబు నిర్వేదం.

    0
    368

    రాష్ట్రంలో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైఎస్సాఆర్ సీపీ అఖండ విజ‌యం మ‌న రాష్ట్ర చ‌రిత్ర‌లో నిలిచిపోయేది. తెలుగుదేశం పార్టీ భ‌విష్య‌త్తును ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒకర‌కంగా అంధ‌కారంలోకి నెట్టివేశాయ‌న్న‌ది వాస్త‌వం. వైసీపీ రెండేళ్ళ పాల‌న‌కు రెఫ‌రెండంగా భావించే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే టీడీపీని తుడిచి పెట్టేసింది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీకి కోలుకోలేని దెబ్బ‌. నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం, క‌డ‌ప‌, క‌ర్నూలు, ప్ర‌కాశం జిల్లాల్లో జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీడీపీని వైసీపీ పూర్తిగా తుడిచి పెట్టేసింది.

    రాజ‌ధాని కేంద్ర‌మైన గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి దారుణ‌మైన దెబ్బ త‌గిలింది. గుంటూరు కార్పోరేష‌న్ స‌హా గుంటూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. ఒక‌ర‌కంగా అమ‌రావ‌తి ఉద్య‌మంపై దీనిప్ర‌భావం ఎక్కువ‌గా వుంటుంది. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో కూడా దాదాపు 90శాతం మున్సిపాలిటీల్లో వైసీపీ విజ‌య‌కేత‌నం ఎగుర‌వేసి, టీడీపీని తొక్కేసింది. బ్యాలెట్ ప‌ద్ద‌తిలో జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో కేవ‌లం నాలుగు మున్సిపాలిటీలే ఏక‌గ్రీవ‌రం కాగా, మిగిలిన అన్ని మున్సిపాలిటీల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఆశాజ‌న‌క‌మైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని టీడీపీ ఆశించింది. అందుకోస‌మే పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న కొడుకు లోకేష్ వారం రోజుల పాటు విస్తృతంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. కానీ ఆ ప్ర‌చార ప్ర‌భావం ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

    ఇవీ చదవండి…

    అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

    భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

    ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

    ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??