చంద్ర‌బాబు నాయుడుకి దెబ్బ మీద దెబ్బ.

  0
  435

  మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు నాయుడుకి దెబ్బ మీద దెబ్బ త‌గిలింది. రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓట‌మి చ‌విచూడ‌డం ఒక ఎత్త‌యితే, ఆయ‌న రాజ‌కీయ ఉద్య‌మానికి కేంద్ర‌బిందువైన అమ‌రావ‌తికి అటుఇటుగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఎన్నిక‌లు జ‌రిగిన అన్ని మున్సిపాలిటీల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని అప‌హాస్యం చేసింది. గ‌త రెండేళ్ళుగా అమ‌రావ‌తే ఎజెండాగా, అమ‌రావ‌తే ఉద్య‌మంగా, అమ‌రావ‌తే త‌న రాజ‌కీయ ఊపిరిగా, ఉనికిగా త‌న పోరాటం సాగించారు. అయితే అమ‌రావ‌తి ఉన్న గుంటూరు జిల్లాలో, ఇటు కృష్ణా జిల్లాలో పార్టీ దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆయ‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణే అంధ‌కార‌మైపోయింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య‌ప‌రిస్థితి. గ‌తంలో అమ‌రావ‌తి రాజ‌ధాని ఎజెండాగా ఎమ్మెల్యేల రాజీనామాతో రెఫ‌రెండం కోరిన చంద్ర‌బాబుకు ఇప్పుడు ఏం మాట్లాడో తెలియ‌ని ప‌రిస్థితి. పంచాయితీల్లో పోలీసులు, కేసులు, బెదిరింపులు, ఏక‌గ్రీవాల‌తో దౌర్జ‌న్యం చేశార‌ని, వైసీపీని ఆడిపోసుకున్న చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు ఇప్పుడు బ్యాలెట్ ద్వారా బుల్లెట్ దించారు. ఇదిలావుండ‌గా సొంత జిల్లా చిత్తూరులోనూ రెండు కార్పోరేష‌న్లు, అన్ని మున్సిపాలిటీల్లో తెలుగుదేశం ఓడిపోయింది. ఇది కూడా చంద్ర‌బాబుకు కోలుకోని దెబ్బే.

  ఇవీ చదవండి…

  అమ్మాయిలూ అలాంటి డ్రెస్ వద్దు..

  భర్తను చంపి.. ఇంట్లో పాతి పెట్టి..

  ఆన్ లైన్ కంపెనీకే టోపీ పెట్టాడు..

  ఇదేంటమ్మా . ఇంత పబ్లిక్ గా .మహిళా దినోత్సవ స్పెషలా .? ఇలా ముందుకు పోతున్నామా..??