ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవమే కాదు.. తల్లిదండ్రులను పూజించుకునే రోజు కూడా. అంటే పేరెంట్స్ వర్షిప్ డే అనమాట. కానీ ప్రేమికుల దినోత్సవానికి ఉన్నంత క్రేజ్ పేరెంట్స్ వర్షిప్ డే కి లేదు. అది కొందరికే తెలుసు. కొంతమంది మాత్రమే ఆ రోజున తమ తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటారు.
కళ్లెదుట ఉంటే వారిని పూజిస్తారు. ఇదిగో ఈయన చూడండి. తల్లిదండ్రులంటే ఆయనకి ఎంతిష్టమో. విధి నిర్వహణలో తల్లిదండ్రులకు దూరంగా కుటుంబంతో ఉండాల్సి వచ్చినా వారిని అనునిత్యం స్మరించుకుంటుంటారు. దూరంగా ఉన్న తల్లిదండ్రులతో రోజూ వీడియో కాల్ మాట్లాడుతుంటారు.
పేరెంట్స్ వర్షిప్ డే రోజున కూడా తల్లిదండ్రుల్ని ఇలా టీవీలో పూజించారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయనతోపాటు భార్య, పిల్లలు కూడా పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇలాంటి వారు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించక మానదు.
आज मातृ पितृ पूजन दिवस पर घर नहीं जा सका तो विडीयो कॉल से माता-पिता जी का पूजन किया। इनके आशिर्वाद और प्रेरणा से ही हम राष्ट्र धर्म का कार्य कर रहे हैं। #मातृ_पितृ_पूजन_दिवस#Parents_Worship_Day #novalentinesday pic.twitter.com/JdOuLn9M59
— Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) February 14, 2022