స్టైలిష్ లుక్ లో మారుతి-సుజుకి ఎలక్ట్రిక్ కార్.

  0
  71

  దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజకీ పెరుగుతోంది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది.

  ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకుంది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును డిజైన్ చేసింది. ఇప్పటి వరకు ఇండియా మార్కెట్లో వచ్చిన ఎలక్ట్రిక్ కార్ల కంటే శక్తివంతమైన కారుగా ఈ కొత్త కారు ఉంటుందని కంపెనీ వర్గాలంటున్నాయి.

  48 KWH బ్యాటరీతో నడిచే ఈ కారును ఒకసారి చార్జ్ చేస్తే 400 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. అదేవిధంగా 59 KWH బ్యాటరీతో నడిచే కారును చార్జ్ చేస్తే 500 కిమీ వరకు ప్రయాణం చేయవచ్చు. గుజరాత్ లోని డీడీఎస్జీ సంస్థ ఈ కార్లకోసం లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేస్తోంది. ఇక ఈ కారు ధర రూ. 13 నుంచి 15 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..