తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు ప్రాంతంలో 12 ఏళ్ళ కొడుకు తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించడమే పాపమైంది. తల్లి అనే కనికరం కూడా లేకుండా కొడుకుకి వాతలు పెట్టింది. ఓ వ్యక్తి తరచూ ఇంటికి వస్తుండడంతో అభంశుభం తెలియని కొడుకు అహ్మద్… పరాయి వ్యక్తి మన ఇంటికి ఎందుకు వస్తున్నాడు ? అతను ఎవరు ? అతనితో నీకు ఏంటి పని ? అంటూ తల్లిని నిలదీయడం మొదలు పెట్టాడు. అలా అడిగిన ప్రతిసారీ ప్రియుడితో కలిసి అట్లకాడ కల్చి వాతలు పెడుతోంది. అయితే ఈ విషయం తెలసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. తల్లిని, ప్రియుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పిల్లాడిని చైల్డ్ లైన్ సెంటర్ కి తరలించారు.