మా ఆయన మంచోడు.. ఆ — ముంచేసింది..

    0
    410

    వజ్రాల వ్యాపారి మొహిల్ చోక్సీపై ఆయన లవర్ బార్బరా జబారికా చేసిన ఆరోపణలను చోక్సీ భార్య ప్రీతి చోక్సీ కొట్టిపారేసింది. రాజ్ అనే పేరుతో తనను మోసం చేశారంటూ బార్బరా జబారికా ఇటీవల చోక్సీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డూప్లికేట్ వజ్రాలు ఇచ్చి తనను నమ్మంచాడని, తనను శారీరకంగా వాడుకునేందుకు ప్రయత్నించాడని కూడా జబారికా ఆరోపించారు. దీనిపై ప్రీతి చోక్సీ ఘాటుగా స్పందించారు.
    మా ఆయన మంచోడు..
    రాజ్ అని పేరు మార్చుకున్నాడని అంటున్న బార్బరా.. నిజానిజాలు తెలుసుకోవడానికి సోషల్‌ మీడియా ఉందిగా అని ప్రశ్నించారు. అదంతా బోగస్‌ అని, బార్బరా ఆరోపణలకు అసలు ఎలాంటి ప్రామాణికత లేదని ప్రీతి వెల్లడించారు. నిజానికి చిన్న పిల్లలు కూడా ఎవరితోనైనా స్నేహం చేసేటపుడు ఫ్రెండ్స్‌ లిస్ట్‌ను ఇంటర్నెట్‌ లో చూస్తున్నారని, లేదా “రివర్స్ గూగుల్ సెర్చ్‌” సోషల్ మీడియాలో వెతుకుతుంటారని చెప్పారు. ఇందుకు కొన్ని సెకన్ల సమయం చాలు.. ఇది చాలా ఈజీ కూడా అని ప్రీతి గుర్తు చేశారు. చోక్సీ చెప్పింది గుడ్డిగా నమ్మేందుకు, ఏమైనా రాతి యుగంలో బతుకుతున్నామా?! అని ప్రశ్నించారు.
    బార్బరా మోసకారి..
    వాట్సాప్ సందేశాల కంటెంట్‌ మార్చడం, ఫోటోషాప్ ద్వారా ఫోటోలు మార్ఫింగ్‌ చేయొచ్చు. ఈ నేపథ్యంలో బార్బరా ఆరోపణలకు ఎలాంటి విశ్వసనీయత లేదని తేల్చి చెప్పారు. ఈ విషయలో ఇంత దుమారం రేగుతున్నా..ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాది మంది ఫాలోవర్లలో ఒక్కరు కూడా ఆమెకు మద్దతుగా ఎందుకు నిలవలేదని పేర్కొన్నారు. తప్పుడు ప్రకటనలతో తన భర్తపై బురద జల్లే ప్రయత్నం ఇదని, అసలు తను ఎక్కడ ఉంటోంది తదితర వివరాలను వెల్లడించని బార్బరా వెర్షన్‌ను ఎలా విశ్వసిస్తామని ప్రీతి చోక్సీ ప్రశ్నించారు.

    ఇవీ చదవండి..

    నూర్జహాన్ మామిడి.. ఒక్కోటి వెయ్యి రూపాయలు..

    ఈ ముసలోడికి 37 వ పెళ్లి.. అమ్మాయికి 16 ఏళ్ళు.

    అరటిపండు టీ ఎందుకు తాగాలి.. ?

    నెల్లూరు హాస్పిటల్లో పెద్ద డాక్టర్ నీచ శృంగార పురాణం..