వీడేమి ఎమ్మెల్యే ..వీడికెంత పొగరు..

  0
  790

  ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ‌ను తాము ఎక్కువ ఊహించేసుకుంటుంటారు. ఎన్నిక‌ల వేళ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వ‌చ్చి వంగివంగి దండాలు పెట్ట‌డం, ఓట్లు అడుక్కోవ‌డం, ఇంటికి వ‌చ్చి మ‌రీ కుశ‌ల ప్ర‌శ్న‌లు వేయ‌డం… అంతా చూస్తూనే ఉంటాం. కానీ అధికారంలోకి వ‌చ్చాక మాత్రం త‌మ అహంకారం, ద‌ర్పం ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ప్ర‌శ్నిస్తే కొట్ట‌డం లేదా త‌మ‌వారితో దౌర్జ‌న్యాలు చేయిస్తుండ‌డం కూడా చూస్తుంటాం. అలాంటి ఘ‌ట‌నే ఇది కూడా. ప్ర‌శ్నించ‌డ‌మే ఆ యువ‌కుడి పాప‌మైంది. అయ్యా… ఎమ్మెల్యేగారూ త‌మ‌కు మాకేం చేశారు ? అని ప్ర‌శ్నించాడు. అంతే చెంప చెళ్ళుమ‌నిపించ‌డ‌మే కాకుండా ప‌క్క‌వాళ్తోనూ కొట్టించాడు. పంజాబ్ రాష్ట్రంలోని బోహాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
  బోహా అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా జోగింద‌ర్ పాల్ కొనసాగుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న‌ను ఓ యువ‌కుడు, అయ్యా త‌మ‌రు నియోజ‌క‌వ‌ర్గానికి ఏం చేశారో చెప్పండి అని ప్ర‌శ్నించాడు. ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీగా ఉండాల్సిన ఆ ఎమ్మెల్యే, ఆ యువ‌కుడిని ద‌గ్గ‌ర‌కి పిలిచి చాచి లెంప‌కాయ కొట్టాడు. అత‌ని చెంప చెళ్ళుమంది. అంత‌టితో ఆగ‌కుండా న‌న్నే ప్ర‌శ్నిస్తావా అంటూ గ‌ద్దించాడు. మ‌రోవైపు వారించాల్సిన పోలీసులు కూడా ఆ యువ‌కుడిని పట్టుకుని త‌లా ఒక దెబ్బ‌వేశారు. ఇక కార్య‌క‌ర్త‌లు ఊరుకుంటారా… వాళ్ళు కూడా దేహ‌శుద్ది చేశారు. ప్రశ్నించిన యువ‌కుడిని ఎమ్మెల్యే కొట్ట‌డం వివాదాస్ప‌ద‌మైంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..