ఇద్దరూ చిన్నపిల్లలే ..పెద్ద పనులే చేశారు.. స్మార్ట్ ఫోన్ల వికృతానికి ఇదో సాక్ష్యం.

    0
    1576

    తెలిసీ తెలియ‌ని వ‌య‌సులో పిల్ల‌లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తే ఏమ‌వుతుందో అనేక దారుణాల్లో ఇదొక దారుణం. 8వ త‌ర‌గ‌తి చ‌దివే ఓ బాలిక స్మార్ట్ ఫోన్ ఉచ్చులో ప‌డి విల‌విల‌లాడుతోంది. ముంబైకి చెందిన ఓ 14 ఏళ్ళ బాలిక త‌న క్లాస్ మేట్ అయిన విద్యార్దితో చాటింగ్ చేస్తోంది. అయితే ఆ విద్యార్ధి చాటింగ్ తీరు న‌చ్చ‌క అత‌ని అకౌంట్ ను బ్లాక్ చేసింది. దీంతో క‌క్ష క‌ట్టిన ఆ విద్యార్ధి మ‌రో అకౌంట్ ఓపెన్ చేసి వేరే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. దాంతో మెసేజ్ లు ఇస్తూ మ‌చ్చిక చేసుకున్నాడు.

     

    చిన్న‌గా ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు

     

    ధైర్యం ఉండే త‌న ముందు బ‌ట్టలు విప్పి నిలబ‌డాలి అంటూ స‌వాల్

    వాడు పెట్టిన ఫ్రెండ్ రిక్వెస్ట్ ను ఆమె యాక్సెప్ట్ చేసింది. దీంతో కొన్నాళ్ళు చాటింగ్ చేసిన అనంత‌రం  ‘’ట్రూత్ ఆర్ డేర్’’ గేమ్ ఆడుదామంటూ ఆ అమ్మాయిని బ‌ల‌వంత పెట్టాడు. ఈ గేమ్ ని ఆల‌న్ లైన్ లో ఇద్ద‌రూ ఆడుతుండ‌గా చిన్న‌గా ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు. ధైర్యం ఉండే త‌న ముందు బ‌ట్టలు విప్పి నిలబ‌డాలి అంటూ స‌వాల్ విసిరాడు. ఈ గేమ్ లో స‌హ‌జంగా మెసేజ్ లు ఇచ్చుకోవ‌డంలో క్వ‌శ్చ‌న్స్ అండ్ ఆన్స‌ర్స్ ఉంటాయి.

    ఒక‌రు స‌వాల్ విసిర‌తే మ‌రొక‌రు స్వీక‌రించేది లేనిది చెప్పాల్సి వుంటుంది. ఆ స‌వాల్ ను స్వీక‌రిస్తేనే ఆ గేమ్ ర‌స‌వ‌త్త‌రంగా వుంటుంది. ఈ గేమ్ లో ఉన్న టెన్ష‌న్ క్వ‌శ్చ‌న్స్ , ఆన్స‌ర్స్ దృష్టిలో పెట్టుకుని బ‌ట్టలు విప్పి నిల‌బ‌డాలి అంటూ స‌వాల్ విసిరాడు. దీంతో ఆ అమ్మాయి దుస్తులు విప్పి, అత‌ని ముందు నిల‌బ‌డింది. అదంతా వీడియో రికార్డ్ చేసిన ఆ అబ్బాయి, అది ఆమెకి చూపించి బ్లాక్ మెయిలింగ్ కి దిగాడు. తాను చెప్పిన‌ట్లు వినాల‌ని, ఎప్పుడు చెబితే అప్పుడు త‌న ముందు న‌గ్నంగా నిల‌బ‌డాలంటూ వేధింపుల‌కు గురి చేశారు.

     

    https://www.timesnownews.com/india/article/mp-schoolmate-lures-14-year-old-girl-into-sharing-intimate-photos-posts-them-on-social-media/671852

    కొన్నాళ్ళు ఇలాసాగిన వేధింపులు మ‌రింత హెచ్చుమీర‌డంతో ఆ అమ్మాయి అత‌నితో చాటింగ్ నిలిపివేసింది. ఆ అమ్మాయిపై మ‌రింత కోపం పెంచుకున్న అత‌ను ఆమె వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోను ఆ అమ్మాయి ఫ్రెండ్ కి కూడా చేర‌డంతో, ఆ విష‌యాన్ని ఆమెకు చెప్పారు. దీంతో ఆ బాలిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు బ్లాక్ మెయిల్ చేస్తున్న అబ్బాయి… గ‌తంలో తాను రిజెక్ట్ చ‌సిన విద్యార్ధేన‌ని తెలిసి నిర్ఘాంత‌పోయింది. పోలీసులు ఆ విద్యార్ధిపై కేసు న‌మోదు చేశారు.

     

    https://ndnnews.in/psycho-doing-nonsense-on-road/