వాడో సైకో.. వాడికి అదో ఆనందం..

    0
    1469

    21ఏళ్ల లా స్టూడెంట్ ను లైంగికంగా వేధించి, ఆమెకు తన ప్యాంట్ విప్పి చూపించిన ఓ వ్యక్తి చెప్పిన కారణం వింటే మతిపోతుంది. నీఛమైన పని చేసిన ఆ వ్యక్తి ఈనెల 22వతేదీ ఓ అమ్మాయి పక్కనే స్కూటర్ ఆపి ప్యాంట్ జిప్పు తీసి తన మర్మాంగాన్ని చూపించాడు. ఆమె వార్నింగ్ ఇస్తున్నా అతడు తన నీఛమైన పనిని ఆపలేదు. పైగా ఆమె అందం గురించి, బాడీ షేపుల గురించి అసభ్యంగా వ్యాఖ్యలు చేశాడు. ఆ విద్యార్థిని గట్టిగా కేకలు పెట్టడంతో పారిపోయాడు. 24ఏళ్ల ఈ ఉన్మాది గురించి ఆ యువతి కేసు పెట్టింది. అతడు గుజరాత్ నవరంగ్ పుర, ఉస్మాన్ పూర్ కి చెందిన చిరాగ్ భాటీగా గుర్తించారు. వరుసగా 2రోజులు ఇదే విధంగా ఆ యువతి పక్కనే స్కూటర్ ఆపుకొని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆమె అడ్రస్ అడిగి తన ప్యాంట్ జిప్పు విప్పి చూపించేవాడు. పోలీసులు అతడిని పట్టుకునేందుకు యువతి ఫిర్యాదు చేసిన ప్రాంతంలో సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ ఉన్మాదిని అరెస్ట్ చేసి విచారిస్తే.. తన భార్య గర్భవతిగా ఉందని, గత 3 నెలలుగా తాను ఆమెతో సెక్స్ లో పాల్గొనలేదని, అందువల్ల డిప్రెషన్ తో ఇలాంటి పని చేశానని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.