దిండు పక్కనే పడిన రాయి కోట్లు తెచ్చిపెట్టింది

  0
  3723

  ఇంట్లో ఓ మ‌హిళ నిద్ర‌పోతున్న స‌మ‌యంలో పైక‌ప్పు నుంచి ఊడిప‌డిన రాయి కోట్లు తెచ్చిపెట్టింది. రూత్ హేమ‌ల్ట‌న్ అనే మ‌హిళ మూడు రోజుల క్రితం నిద్ర పోతుండ‌గా… పెద్ద‌శ‌బ్దం చేస్తూ ఇంటి పైక‌ప్పు రేకుల‌ను ప‌గ‌ల‌గొట్టుకుంటూ మంచం ప‌క్క‌న ప‌డింది. తృటిలో ఆమెకు ప్రాణాపాయం త‌ప్పింది. త‌ల ప‌క్క‌నే ప‌డ్డ ఆ రాయి రెండు కిలోలు ఉంది. ఎవ‌రైనా ఇంటి మీద‌కి రాయి విసిరేసారా అని చుట్టుప‌క్క‌ల ప‌రిశీలిస్తే ఎవ‌రూ క‌నిపించ‌లేదు. అయితే ఆ రాయి ప‌డిన చోట దుమ్ము, ధూళి, రాయి త‌ప్ప మ‌రొక‌టి క‌నిపించ‌లేదు. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు వ‌చ్చి గ‌మ‌నించి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయారు.

  హేమ‌ల్ట‌న్ మాత్రం ఆ రాయిని త‌న‌తోనే ఉంచుకుంది. ఆ త‌ర్వాత అనుమానం వ‌చ్చి త‌మ్ముడుకి చెప్ప‌డంతో అత‌డు ఆ రాయిని ప‌రీక్షించి, ఇది ఆకాశంలోని ఉల్క‌పాతంలోని ఒక భాగ‌మ‌ని నిర్ధారించాడు. శాస్త్రీయ ప‌రిశోధ‌న‌లో కూడా అదే నిజ‌మ‌ని నిర్ధార‌ణ అయింది. విశ్వాంత‌రాళంలో గ్ర‌హశ‌క‌లాలు అప్పుడ‌ప్పుడు భూవాతావ‌ర‌ణంలోకి వ‌చ్చి ఆ వేగానికి మండిపోతాయి. కొన్నిమాత్రం భూమి మీద ప‌డిపోతాయి. అరుదుగా జ‌రిగే అలాంటి గ్ర‌హ‌శ‌క‌ల‌మే ఈ రాయి. దీని కార్బోనోసియ‌స్ కాండ్రైట్ గా ప‌రిశోధ‌కులు తేల్చారు. ఇప్పుడు ఈ రాయి విలువ 17 కోట్ల రూపాయ‌లుగా లెక్క క‌ట్టి, మ్యూజియం నిర్వాహ‌కులు కొనేందుకు ముందుకు వ‌స్తున్నారు. అదృష్టం అంటే ఇలాగే ఉండాలి. ఆ రాయి గ‌నుక ఆమె త‌ల మీద ప‌డిఉంటే ప్రాణం పోయి ఉండేది. ఇప్పుడు అదే రాయి కోట్లు తెచ్చిపెట్టింది.

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..