ఈ మహిళా ఎస్సై అసలు మనిషేనా..?

    0
    3454

    ఓ మహిళా పోలీస్ అధికారి కసాయితనం, కిరాతకత్వం చూస్తే మహిళల్లో కూడా ఇలాంటి వారు ఉంటారా అనిపించక మానదు. 8 నెలల గర్భిణి, భర్త మోటర్ సైకిల్ పై పోతున్న సమయంలో, ఆ బైక్ ఆపి భర్తకు హెల్మెట్ ఉన్నా, వెనకున్న భార్యకు హెల్మెట్ లేదని ప్రశ్నించింది లేడీ ఎస్సై. తన భార్య పురిటి నెప్పులతో ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని, ఫైన్ వేస్తే చెల్లిస్తానని ఆ భర్త చెప్పాడు. ఆమె వేసిన ఫైన్ కి సరిపడా డబ్బులు లేకపోవడంతో, ఆన్ లైన్ లో డబ్బులు కడతానన్నాడు. అయినా ఆ మహిళా ఎస్సై వినకుండా బైక్ తాళాలు తీసుకుంది. ఎర్రటి ఎండలో బైక్ స్టేషన్ కి తీసుకు రమ్మని తన సిబ్బందికి ఆదేశించింది. వారితోపాటు భర్త, భార్య కూడా స్టేషన్ కి వచ్చారు.

    భర్త, భార్యను ఆ ఎండలో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ కి నడిపించి తీసుకెళ్లాడు. దీంతో ఆమెకు తీవ్రమైన అనారోగ్యం వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే మయూర్ బంజ్ ఎస్పీ, ఆ మహిళా పోలీస్ అధికారిని సస్పెండ్ చేశాడు. తన భార్య గర్భంతో ఉన్నప్పుడు ఎండలో 3 కిలోమీటర్లు నడిపించడమే కాకుండా తనను అకారణంగా జైలుగదిలో పెట్టి 3 గంటలపాటు వేధించిందని తన భార్యను ఎండలోనే నిలబెట్టిందని విక్రమ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆన్ లైన్ లో తాను తాను ఫైన్ కడతానని చెప్పినా, తన భార్యకు హెల్మెట్ లేదన్న ఒకే ఒక్క కారణంతో ఇంత రభస సృష్టించిందని అన్నాడు. ఈ సంఘటన ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లా నోట గ్రామంలో జరిగింది.

     

     

    ఇవీ చదవండి

    బట్టనెత్తి కనపడితే ఇంత గొడవా – భలే భలే

    పార్కుల్లో ప్రేమ జంటలే వాడి టార్గెట్.

    నగ్నంగా పోజులిస్తారు- బెడిసికొడితే??

    బుసలు కొట్టే కోడెనాగుపై ఆయన చేయి పడితే అంతే..