తాళిబొట్టు లాకర్లో పెట్టి ,భార్యను అంటే ఎలా?

  0
  165

  భర్త నుంచి విడిగా ఉన్నప్పటికీ మెడలో మంగళసూత్రం తీసేయడమంటే అది క్షమించరాని నేరమని మద్రాస్ హైకోర్టు అభిప్రాయబడింది . ఈ చర్య భర్తను మానసికంగా క్రూరంగా హింసించడమేనని అభిప్రాయబడింది . భారతీయ స్త్రీకి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహమైన తరువాత మహిళలకు మంగళసూత్రం అనేది వివాహ జీవితానికి ఒక సూత్రధారమని పేర్కొంది . ఏడు అడుగులు బంధంతో వేదమంత్రాలతో భర్త కట్టిన తాళిని తీసివేయడం అంటే ఆ భర్తతో భార్యకు సంసారం చేయడం ఇష్టం లేదన్న అభిప్రాయానికి కోర్టు వచ్చింది.

  హైకోర్టు న్యాయమూర్తులు బియ్యం వేలుమని ,సుందర్ ఈ విషయమై తీర్పు చెబుతూ మంగళసూత్రం తీసేసిన మహిళకు భార్యనని చెప్పుకునే అర్హత లేదని అందువల్ల ఆమెకి ఇష్టం లేకపోయినా విడాకుల మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది . మద్రాస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ గా ఉన్న సి శివకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది 2016లో ఈరోడ్లోని స్థానిక కోర్టు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీనిపై శివకుమార్ హైకోర్టులో కేసు వేశారు. భర్తతో గొడవపడి తాను తాళి తీసేసిన మాట వాస్తవమేనని కూడా భార్య ఒప్పుకోవడంతో హైకోర్టు దీన్ని క్రూరమైన నేరంగా ,భర్తను మానసికంగా హింసించే చర్యగా భావిస్తూ విడాకులు మంజూరు చేసింది . కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
  తాళిని తాను తీసేసి బ్యాంకు లాకర్లో పెట్టినట్టు భార్య కూడా ఒప్పుకుందని ఏ భారతీయ స్త్రీ కూడా భర్త కట్టిన తాళిని తీసేసి ఆ భర్తతో తాను కాపురం చేస్తానని లేదా ఆ భర్త విడాకులు కోరినప్పుడు విడాకులు తనకు సమ్మతం కాదని చెప్పే హక్కు కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది . తాళిని తీసేయడం అంటే భర్త చనిపోయినట్టుగా భావించాలన్నది భారతీయ సంప్రదాయమని అందువల్లే సంప్రదాయానికి వ్యతిరేకంగా విరుద్ధంగా కోర్టు కూడా తీర్పు చెప్పలేదని స్పష్టం చేసింది . హిందూ వివాహ చట్టంలో ఏడడుగులు, తాళి ఇవన్నీ కూడా చట్టపరంగా ఉండాల్సిన అంశాలని కూడా గుర్తు చేసింది . అందువల్ల తాళి తీసేయడం అనేది సాంప్రదాయంగా గానే కాకుండా చట్టపరంగా కూడా నేరమని ఆ భర్తతో కాపురం చేయడంభార్యకు ఇష్టం లేదన్నది ఇది స్పష్టం చేస్తుందని కోర్టు అభిప్రాయపడింది

   

  ఇవి కూడా చదవండి..

  మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

  రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

  మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

  సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.