వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు. విష్ణు హెచ్చరిక.

  0
  441

  మంచు విష్ణు హెచ్చరిక..!
  వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు..
  ==========================
  మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచి విష్ణుకు కోపం వచ్చింది. హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు, థంబ్‌నైల్స్‌ పెడితే క్షమించేది లేదని విష్ణు హెచ్చరించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటీనటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నారు. అలా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తీసుకుంటాం. వాటిలో థంబ్‌నైల్స్‌ హద్దులు దాటుతున్నాయి. నటీమణులు మన ఆడపడుచులు. వారిని గౌరవించాలి’’ అని విష్ణు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అసభ్యకర వీడియోలు పోస్ట్‌ చేస్తే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. హద్దులు మీరే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లను నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని విష్ణు పేర్కొన్నారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..