RRR సినిమా థియేటర్ లో తుపాకీతో ఫోజులిచ్చాడు.

    0
    153

    RRR సినిమా ఉత్సాహంలో ఇతడెవరో , థియేటర్ లో తుపాకీతో ఫోజులిచ్చాడు. ఇస్తే ఇచ్చాడుగాని , ఇతడికోసం ఇప్పుడు పోలీసులు వెదుకుతున్నారు. తూర్పు గోదావరిజిల్లా పిఠాపురంలో థియేటర్ లో సినిమాకు వచ్చిన ఇతను ఇలా చేస్తూ వీడియొ కూడా తీయించుకోవడం కొసమెరుపు. మళ్ళీ , తుపాకీని తన కేస్ లో పెట్టేసుకున్నాడు.

    ఇంతకీ ఈ పోజుల రాయుడెవరో అతడికోసం పోలీసు గాలిస్తోంది. కేసుకూడా నమోదుచేశారు. అది బొమ్మ తుపాకా ..? లేక నిజమైనదా ..? అన్నది తేలాల్సి ఉంది.. అసలు తుపాకీ తీసుకొని థియేటర్ కి రావడం , వచ్చినా దాన్ని చూపిస్తూ వీడియో దిగడం , పెద్ద నేరమే.. అది బొమ్మ తుపాకీ అనుకున్నా , ఇలా చేయడం కూడా నేరమే. అందువల్ల ఈ శాల్తీ పోలీసు కేసులో ఇరుక్కోక తప్పదు..

    ఇవీ చదవండి… 

    అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

    నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

    చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

    సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..