అమ్మాయివేషంతో రోజూ బస్సులో అబ్బాయి..

  0
  342

  వీడు ఎవడో గానీ వీడి చావు తెలివితేటలు వాడిని జైలు పాలుచేశాయి. ఢిల్లీ బస్సుల్లో అమ్మాయిలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని ఈ కంత్రి గాడు అమ్మాయిలాగా వేషం వేసాడు. మీసాలు ఉన్నాయి , గడ్డం ఉంది, అయినా మాస్కుతో దాన్ని దాచేయాలనుకున్నాడు , అమ్మాయిలాగానే వేషం వేసుకుని మాస్క్ కట్టుకుని, చున్నీతో , నెత్తిమీద స్కార్ఫ్ లా కప్పుకొని బస్సులో హ్యాపీగా అమ్మాయిల పక్కనే కూర్చున్నాడు, అయితే ఎందుకో కండక్టర్ కి ,అనుమానం వచ్చింది, నువ్వు ఎవరు అని అడిగాడు, అమ్మాయినేనన్నాడు. మాస్క్ తీయమంటే , కష్టం మీద తీసాడు.. ఇంకేముంది.. ?? కోర మీసం , బవిరి గడ్డం.. ఏం సమాధానం చెప్పు కోవలో అబ్బాయి గారికి అర్ధం కాలేదు. వెంటనే పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. ఎప్పటినుండి ఇలా చేస్తున్నావ్ అని అడిగితే బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పటి నుంచి ఇలాగే చేస్తున్నా అని చెప్పాడు , మొత్తానికి జైలుపాలయ్యాడు కంత్రీగాడు..

  ఇవీ చదవండి… 

  అందమైన ఒంటె రెండు కోట్లు గెలిచింది..

  నాగచైతన్యను మరోసారి బాధపెట్టిన సమంత..!

  చీకేసిన మామిడిముట్టి లాంటి తలకి మళ్లీ హెయిర్ స్టైలిస్టు కావాలా..?

  సోనూ సూద్, గౌతమ్ రెడ్డి ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటన్నారో..