మింగేసిన సెల్ ఫోన్ కడుపులోనే ఆరునెలలు ..

  0
  6002

  సెల్ ఫోన్ మింగేశాడు.. చివరకు ఏమైందంటే..
  సెల్ ఫోన్ లోకంలో మునిగిపోయి ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా ఏదంటే అది నోట్లో పెట్టుకునేవారిని చూసుంటాం. కానీ ఇతను ఏకంగా సెల్ ఫోన్ నే మింగేశాడు. ఆ సంగతి ఎవరికైనా చెబితే బాగుండదనుకున్నాడో ఏమో.. సీక్రెట్ గా ఉంచాడు.

  బాత్రూమ్ కి వెళ్లినప్పుడు బయటకి వచ్చేస్తుందని అనుకున్నాడు. కానీ అదేమో కడుపులోనే తిష్టవేసింది. ఆ తర్వాత కొన్నిరోజులకు అతడా సంగతి కూడా మరచిపోయాడు. ఆరు నెలలు గడిచింది. చిన్నగా సెల్ ఫోన్ లోని బ్యాటరీ, అందులోనీ యాసిడ్స్ దెబ్బకి అతడికి కడుపు నొప్పి మొదలైంది. అప్పుడు గుర్తొచ్చింది సెల్ ఫోన్ విషయం. అన్నం తినలేక, మంచినీరు కూడా తాగలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరాడు

  వైద్యులు అసలు విషయం తెలుసుకుని 2 గంటలసేపు ఆపరేషన్ చేసి అతడి కడుపులోనుంచి సెల్ ఫోన్ బయటకు తీశారు. కడుపులో ఇన్ఫెక్షన్ పోవడానికి మందులు ఇచ్చి పంపించేశారు. ఈజిప్ట్ లో ఈ సంఘటన జరిగింది. అశ్వన్ ఆస్పత్రి వైద్యులు ఇలా కడుపు కోసి సెల్ ఫోన్ బయటకు తీశారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..