డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మహిళా ఎమ్మెల్యే .

    0
    298

    ఓ మహిళా ఎమ్మెల్యే కొడుకు తాగి వాహనం నడుపుతుంటే పోలీసులు ఫైన్ వేశారన్న ఆగ్రహంతో మహిళా ఎమ్మెల్యే స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. తాగని పిల్లలెవరో తనకు చూపించాలని తాగినంత మాత్రాన ఫైన్ ఎలా వేస్తారంటూ గొడవకు దిగింది. రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ తన భర్త ఉమేష్ సింగ్ రాథోడ్ తో కలసి జోథ్ పూర్ స్టేషన్ ఎదుట బైఠాయించింది.

    డ్రంకెన్ డ్రైవ్ కేసులో అరెస్ట్ చేసిన తన కొడుకుని, బంధువుల్ని వదిలిపెట్టాలని డిమాండ్ చేసింది. ఒక దశలో పోలీసులతో కూడా పెనుగులాడింది. తాగని పిల్లలెవరూ చూపించాలని పోలీసుల కొడుకులు తాగరా, మీరు మద్యం తాగడంలేదా, మద్యం తాగితే తప్పేంటి అంటూ గొడవకి దిగింది. అందరు పిల్లలూ తాగుతున్నారు, మా పిల్లలు తాగితేనే మీకు తప్పుగా అనిపించిందా అంటూ పోలీసుల్ని దులిపేసింది. తాగి యాక్సిడెంట్ చేస్తే తప్పు కానీ, తాగి వాహనంలో ఇంటికొస్తుంటే అరెస్ట్ చేయడం ఏంటంటూ నిలదీసింది. మీ అంతు చూస్తానంటూ బెదిరించింది.

    ఇవీ చదవండి

    సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

    చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

    డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..