ఓ స్టూడెంట్ తన గర్ల్ ఫ్రెండ్ ని సూట్ కేస్ లో ఉంచి హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్తుండగా వాచ్ మెన్ పట్టుకున్నాడు. ఇదేదో విదేశాల్లోనో, సినిమాల్లోనో జరిగింది కాదు. కర్నాటకలోని మణిపాల్ లోని ఓ కాలేజీలో జరిగింది. సూట్ కేస్ భారంగా ఉండటం, కష్టంగా తీసుకు పోతుండటంతో సెక్యూరిటీ గార్డ్ కి అనుమానం వచ్చింది. తర్వాత సెక్యూరిటీ గార్డ్, ఆ సూట్ కేస్ తనిఖీ చేశాడు. సూట్ కేసు ఓపెన్ చేసి సూట్ కేసులోనుంచి గర్ల్ ఫ్రెండ్ బయటకు వచ్చింది. సెక్యూరిటీ గార్డ్ దయ్యాన్ని చూసినంతగా భయపడిపోయాడు.
ఇది సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరగడంతో ఇప్పుడు దేశంలో దీనిమీదే చర్చ జరుగుతోంది. రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయి ఎప్పటినుంచి ఆ గదిలో ఉందో, అసలు లోపలికి ఎలా వెళ్లిందో అని ఆరా తీస్తున్నారు. లోపలికి కూడా సూట్ కేస్ లోనే తీసుకెళ్లాడా అనే అనుమానంతో సీసీ టీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అసలు కాలేజీ బాయ్స్ హాస్టల్ లోకి గర్ల్స్ కి ప్రవేశం ఉండదు, గర్ల్స్ హాస్టల్ లోకి బాయ్స్ కి ఎంట్రీ ఉండదు. కానీ ఇలా తన గర్ల్ ఫ్రెండ్ ని చూడకుండా ఉండలేక నేరుగా ఆమెనే రూమ్ లోకి తీసుకెళ్లాడు ఆ కుర్రాడు. దీనికి అతని ఫ్రెండ్స్ కూడా సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు హాస్టల్ సిబ్బంది.
In my life, I’ve seen a lot of crazy things. However, that Manipal lad trying to sneak a girl out via a suitcase is right at the top pic.twitter.com/yOteKVCAh3
— Shibubuu (@shibubuu27) February 2, 2022