ఐరన్ సూట్లో ,పక్షిలాగా ఎగిరి వచ్చేశాడు..

  0
  137

  ప‌క్షిని చూస్తే ఏమ‌నిపిస్తుంది. ఆ ప‌క్షిలా మ‌నం కూడా ఎక్క‌డికైనా ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది క‌దా. కానీ అది సాధ్య‌మేనా ? ఇప్పుడు కాక‌పోయినా భ‌విష్య‌త్తులో సాధ్య‌మే. ఎందుకంటే టెక్నాల‌జీ అంత‌లా పెరిగిపోయింది. మ‌నం హాలీవుడ్ సినిమాల్లో చూస్తూనే ఉంటాం. హీరో జెట్ సూట్ ధ‌రించి అమాంతం పైకి ఎగిరి, వేగంగా ప్ర‌యాణిస్తూ అద్భుతాలు చేస్తుండ‌డం చూశాం. అలాంటి జెట్ సూట్ ని త‌యారు చేశాడు ఆర్మీకి చెందిన అధికారి రిచ‌ర్డ్ బ్రౌనింగ్.

  అత‌ను త‌యారు చేసిన జెట్ సూట్ ధ‌రించి హ్యాంప్ షైర్ లో ప్ర‌ద‌ర్శించాడు. ర‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో ఎలా పాల్గొన‌వ‌చ్చో అధికారుల ముందు ప్ర‌ద‌ర్శించాడు. గంట‌కు 80 మైళ్ళ వేగంతో, అంటే 120 కి.మీ వేగంతో ఈ జెట్ సూట్ సాయంతో ప్ర‌యాణించ‌వ‌చ్చు. ఒక ప్రాంతం నుంచి మ‌రోప్రాంతానికి వెళ్ళొచ్చు. దీని స‌హాయంతో కొండ‌లు, వాగులు, వంక‌లు దాటేయ‌చ్చు. ఎంత సేఫ్ గా ఎగ‌ర‌వ‌చ్చో, అంతే సేఫ్ గా ల్యాండ్ కూడా కావ‌చ్చు. ఈ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో రిచ‌ర్డ్ బ్రౌనింగ్ ఏ మాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా తన గమనాన్ని మార్చుకుంటూ, నిర్ధిష్ట గ‌మ్యాన్ని చేరుకున్నాడు. ర‌క్ష‌ణ రంగంలో జెట్ సూట్ వాడ‌కం వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలుంటాయో తెలియ‌జేస్తూ ఆయ‌న ఈ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చాడు.

   

   

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..