సెకెండ్ హ్యాండ్ కారు కొంటానని వచ్చి..

    0
    96

    సెకెండ్ హ్యాండ్ కారు కొంటానని వచ్చి , టెస్ట్ డ్రైవ్ పేరుతో , ఓనర్ ని మోసంచేసి కారుతో పరారయ్యాడు , ఓ చీటర్.. తన కారు అమ్ముతానని త్యాగి అనే వ్యక్తి ఆన్ లైన్లో పోస్టింగ్ పెట్టాడు. అదిచూసి నితీష్ భరద్వాజ్ అనే వ్యక్తి కారుకొంటానని ముందుకొచ్చాడు. ఆరు లక్షలకు బేరం కుదిరింది. కారు ట్రయిల్ చూస్తానని చెప్పి త్యాగి కీస్ అడిగాడు. తనుకూడా వస్తానని ఓనర్ పక్క సీట్లో కూర్చున్నాడు.

    కొంచెం దూరం పోయినతరువాత , కారు నచ్చిందని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ 10 వేలు ఇస్తానని చెప్పాడు. కారు ఆపి , అడ్వాన్స్ మొత్తాన్ని ఉత్తరం దిక్కు తిరిగి ఇస్తానని దిగమన్నాడు. డబ్బులు అలా ఇవ్వడం తన సెంటిమెట్ అని చెప్పాడు. కారు ఓనర్ , కిందకు దిగినవెంటనే , కారు తీసుకొని పరారయ్యాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి , రెండు రోజుల తరువాత సిసి కెమెరాల ఆధారంగా నితీష్ భరద్వాజ్ ని పట్టేశారు. ఉద్యోగం దొరక్క , ఇలా చోరీలు చేస్తున్నానని ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసి జైల్లోపెట్టారు..

     

    ఇవీ చదవండి… 

    టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

    సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

    పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

    కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..