ఆమె చివరిసారిగా తండ్రికి ఇలాచెప్పి ..

  0
  352

  మోడలింగ్ పై మోజుతో ఆ రంగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న ఓ యువతి, ఆత్మహత్య ప్రయత్నం చేసింది. చివరి సారిగా ఒక హోటల్ ఆరో అంతస్తుపైకి ఎక్కి తన తండ్రికి వీడియో కాల్ చేసింది. నా మొహం చూడు, ఇంకెప్పుడూ నేను నీకు కనిపించను అంటూ దూకేసింది. కూతురు చెప్పిన విషయాన్ని తండ్రి వెంటనే పోలీసులకు చేరవేసి కాపాడాలని ప్రార్థించాడు. అప్పటికే ఆమె హోటల్ కింద రక్తపు మడుగులో పడిపోయి ఉంది. ఉదయ్ పూర్ నుంచి జోథ్ పూర్ కు మోడలింగ్ కోసం వచ్చిన గంగున్ ఉపాధ్యాయ హోటల్ లో ఉంటోంది.

  తండ్రి వ్యాపారవేత్త. ఏం జరిగిందో ఏమో, ఉదయం హోటల్ పై అంతస్తుకి వెళ్లి, తండ్రికి కాల్ చేసి, చివరి సారిగా నన్ను చూసుకో అంటూ మొహం చూపించింది. ఆ తర్వాత ఫోన్ పక్కనపెట్టేసింది. హోటల్ పైనుంచి దూకేసింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉందని ఆస్పత్రి అధికారులు చెప్పారు. ఆమె ఆత్మహత్యా ప్రయత్నానికి కారణాలు తెలియవని పోలీసులు చెప్పారు. ఆమె మొబైల్ ఫోన్ నెంబర్లు, చాటింగ్ లు చూసిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడి సంఘటనకు కారణాలు తెలుసుకుంటామని చెప్పారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..