ఎన్నికల్లో పోటీకి రెండో భార్యకోసం ఊరంతా బ్యానర్లు..

  0
  203

  ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకొక భార్య కావాలని ఓ వ్యక్తి నగరమంతా బ్యానర్లు, పోస్టర్లు కట్టేశారు. ఇదేదో అతను జోక్ గా చేసింది కాదు. సీరియస్ గానే ఇలా ప్రకటనలు ఇచ్చాడు. రమేష్ పాటిల్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేయాలని భావించాడు. అయితే అతడికి ముగ్గురు పిల్లలు వుండటంతో పోటీకి అర్హుడు కాదు. దీంతో నిరాశకు గురవకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఆలోచన చేశాడు. ఆ తర్వాత తనకు, తన భార్యకు ఎన్నికలలో పోటీ చేసే అర్హత లేదని అర్ధమైంది. దీంతో రెండవ పెళ్లి చేసుకుని, ఆ భార్యను పోటీలో నిలపాలని ఆలోచించాడు.

  మొదటి భార్యతో మాట్లాడి ఒప్పించాడు. ఆ వెంటనే నగరమంతా బ్యానర్లు, పోస్టర్లు వేశారు. తన తరపున ఎన్నికలలో పోటీచేసేందుకు రెండవ భార్య కావాలని, ఇష్టమైన వారు సంప్రదించాలని ఫోన్ నుంబర్లతో సహా ప్రకటనలు ఇచ్చాడు. ఔరంగాబాద్ లో మాత్రమే కాదు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బ్యానర్లు కట్టించాడు. భార్య కావలనడమే కాదు.. అర్హతలు కూడా బ్యానర్లో రాయించాడు.

  తనకు కాబోయే భార్యకు 25 నుంచి 40 ఏళ్ల వయసులోపు ఉండాలని షరతు కూడా పెట్టారు. పెళ్లికాని వారు, వితంతువులు, విడాకులైన వారు, ఏ కులమైనా సరే, ఇద్దరు పిల్లలకు మించకుండా ఉన్నవారై ఉండాలని షరతులు పెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ బ్యానర్లు చూశాక మహిళా సంఘాలు బయటకొచ్చాయి. ఎన్నికల కోసం మహిళలను ఆట వస్తువుల్లా భావిస్తారా అంటూ అతడిపై చర్యలు తీసుకోవాలని ఉద్యమాలు చేస్తున్నారు.

   

  ఇవీ చదవండి… 

  టెన్త్ క్లాస్ అమ్మాయిలే లవర్ ని చంపించారు..

  సమంత ,నువ్వు సెకండ్ హ్యాండ్.. అమాయకుణ్ణి మోసం చేసావ్..

  పెళ్లి వయసు 21 ఏళ్లకు పెంచడంపై ఈ అమ్మాయి చెప్పేది వింటే..?

  కలిగిరి అమ్మాయి.. ఎనిమిదో క్లాసులోనే ఎంత ఎదిగింది..