21 రోజుల తరువాత మ్యాన్ ఈటర్ టైగర్ ని పట్టేశారు.

  0
  5959

  నరమాంసం రుచిమరిగిన పులిని 21 రోజుల తరువాత ఎట్టకేలకు నీలగిరి అడవుల్లో మదుమలై టైగర్ రిజర్వ్ ఏరియాలో పట్టేశారు.తమినాడులో నీలగిరి అటవీ పేరంటాల చుట్టుపక్కల ఈ పులి దెబ్బకు పల్లెలు నిద్రలేని రాత్రిళ్ళు గడిపారు. పులిని చంపకుండా పట్టుకోవాలని కమల్ హాసన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వందలమంది ఫారెస్ట్ సిబ్బంది , అడవి మొత్తం గాలించి ఎట్టకేలకు , పులిని రెండు దఫాలు , మత్తు బుల్లెట్లతో షూట్ చేసి , అది స్పృహ తప్పిన తర్వాత బందించి తీసుకెళ్లారు. ఈ పులి ఇప్పటివరకు నలుగురిని చంపింది. లెక్కలేనన్ని పశువులను చంపింది. ఈ పులిని పట్టేందుకు , తమిళనాడు , కర్ణాటకకు చెందిన 100 మంది ఫారెస్ట్ హంటింగ్ నిపుణులు , రెండు శిక్షణపొందిన ఏనుగులు , వాసన పసిగట్టే వేటకుక్కలు, రంగంలోకి దిగాయి. దీనికి T -23 అనే కోడ్ నేమ్ ఇచ్చారు. ఇటీవల కోర్టుకూడా , నరమాంసం రుచిమరిగిన పులిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయాలనీ  ఆదేశాలు ఇచ్చింది. మొత్తానికి నరమాంసం రుచిమరిగిన పులి వేట ఇలా ముగిసింది..

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..