ఊ అంటారా.? ఊఊ అంటారా.?

  0
  392

  పుష్ప సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ పై ఇటీవల కేసు దాఖలైనట్టు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా అనే సాంగ్ లిరిక్స్ పై పురుష సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిందని, వారు కేసు వేశారని అంటున్నారు. అయితే ఇప్పుడీ కేసుపై హీరోయిన్ మాధవీ లత సెటైరిక్ గా స్పందించింది.

  సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టింది మాధవీ లత. ‘వాయమ్మో పుష్ప ఐటెం సాంగ్ మీద కేసు అంటగా.. ఇండస్ట్రీలో 98 శాతం పాటలు ఇలాగే ఉంటాయి. ప్రతి సాంగ్ పై కేసు పెట్టుకుంటూ పోతే ఇక పాటలు లేని సినిమాలు చేసుకోవాల్సిందే. నేను కూడా అమ్మాయిలపై రాసే సాంగ్స్ మీద కేసులు పెడతా అని కామెంట్స్ చేసింది. పుష్ప చిత్రంలోనే ఉన్న ‘సామి సామి’ సాంగ్ పై తాను కేసు పెడతా అంటూ మాధవి లతా సెటైరికల్ కామెంట్స్ చేసింది. ఏంటి.. ఒక అమ్మాయికి మగాడిని చూస్తే.. అతడు పిలిస్తే అంత చులకనగా వెళ్ళిపోతుందా… అబ్బాయి నడచి వెళ్లిన చోట భూమికి మొక్కుతుందా.. మహిళల పరువు పోయింది. అంటూ కామెంట్ చేసింది మాధవీ లత.

  పుష్ప సినిమా శుక్రవారం రిలీజవుతోంది. అల్లు అర్జున్ గెటప్, ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం, సుకుమార్ దర్శకత్వం, దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు సమంత తొలి సారి చేసిన ఐటెం సాంగ్.. ఇలా అనేక అంశాలు పుష్ప చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెంచేశాయి.

  ఇవీ చదవండి

  పోలీసులపై అండర్ వేర్లు నిరసన.

  ఎస్సై రాజేశ్వరి..పోలీస్ బాహుబలి..

  పోటోషూట్లలోనే జాన్వికి కోట్లు.. లేటెస్ట్ షూట్లో పిచ్చెక్కించింది.

  తిరుమల నామాల పార్కులో కోడె నాగు.