లవర్ కోసం ఇద్దరమ్మాయిల ఫైట్..

  0
  15072

  సోషల్ మీడియా ప్రభావమో, పెరుగుతున్న నాగరికతపై మోజో.. తెలియదు కానీ అమ్మాయిల్లో నేర ప్రవృత్తి ఎక్కువ అవుతోంది. ఇటీవల కాలంలో ఇది స్పష్టంగా కనిపించే పరిణామం. ఓ యువకుడితో స్నేహితులుగా ఉన్న ఇద్దరమ్మాయిలు ప్రేమాయణంసాగించారు. వాడు కూడా ఒకరికి తెలియకుండా మరొకర్ని బుట్టలో వేసుకుని వాడుకున్నాడు. చివరకు ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో మరో యువతి, వాడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిపై కత్తితో దాడి చేసింది. కర్నాటకలోని సిడ్లగట్ట తాలూకా, ఆనిమడుగు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గంగరాజు అనే 20 ఏళ్ల యువకుడు మౌనిక, గంగోత్రి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాడు. ఆ అమ్మాయిలిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇటీవల పెద్దలు గంగరాజుకి మౌనికతో వివాహం జరపాలని నిశ్చితార్థం చేశారు. ఇది తట్టుకోలేని గంగోత్రి, ఆదివారం తెల్లవారు ఝామున మౌనిక ఇంటికెళ్లి కత్తితో ఆమెను పొడిచింది. తీవ్ర గాయాలైన మౌనికను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గంగోత్రిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..