కాజల్ అగర్వాల్ తల్లి కాబోతోందా..?

  0
  223

  టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గర్భిణి అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 2021 అక్టోబర్ లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును కాజల్ వివాహం చేసుకుంది. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది కాజల్. ఇటీవల కాజల్ గర్భిణి అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇన్ని రోజులూ ఈ విషయంపై మౌనంగా ఉన్న కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎట్టకేలకు తన మౌనాన్ని వీడి ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడింది.


  ”ఇప్పుడే దాని గురించి మాట్లాడటం ఇష్టం లేదు. సమయం వచ్చినప్పుడు నేను దాని గురించి చెబుతాను” అంటూ అసలు విషయాన్ని దాటవేసింది కాజల్. మరోవైపు తన సోదరి నిషా తల్లిగా మారడం చూసి మాతృత్వంపై తనకు కలిగిన భావాల గురించి చెప్పుకొచ్చింది. మాతృత్వం గురించి కాజల్ మాట్లాడుతూ ఆమె జీవితం ఎలా మారిందో నేను చూశాను. మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూతి అని నేను అనుకుంటున్నాను. నా ఇద్దరు మేనల్లుళ్లు కబీర్, ఇషాన్‌ల సహవాసంలో నేను ఇప్పటికే తల్లిలా భావిస్తున్నాను అని చెప్పాలి అని పేర్కొంది.

  ఇవీ చదవండి

  సినిమాహీరో అని ఎగబడితే ఇదే గతి..,పాపం నర్సు .

  చీరకట్టుకున్నవాళ్లంతా పతివ్రతలా..?

  డ్రగ్స్ , గర్ల్స్ , క్లబ్స్ ఆర్యన్ హై క్లాస్ క్రూయిజ్ లైఫ్ ఎలాంటిదో చూడండి..